ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
సోషల్ మీడియాలో సెలెబ్రిటీలకు ఎదురయ్యే ట్రోలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని సార్లు సెలెబ్రిటీలు షేర్ చేసే ఫోటోలపై విపరీతమైన నెగెటివిటీ వస్తుంది. తాజాగా ఇలానే ఓ మళయాలీ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రజినీ చాందీ(69)పై వచ్చిన ట్రోలింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ముదురు వయసులో ఇలాంటి ఫోటో షూట్ ఏంటని అందరూ టార్గెట్ చేసి తిట్టిపోయడంపై ఆమె స్పందించింది.
నేను కాస్త మోడ్రన్ తయారై చేసిన ఫోటోలపై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. మీరు ఇంకా చావలేదా? అని కొందరు అడిగారు. ఈ వయసులో ఇలాంటి పనులేంటి? మూలన కూర్చుని బైబిల్ చదువుకుంటూ కూర్చో అని కొందరు సలహాలు ఇచ్చారు. నేను ఒక డొక్కు ఆటోలాంటిదాన్ని అంటూ ట్రోల్ చేశారంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మహిళలు కూడా తనను ట్రోల్ చేశారంటూ తెలిపింది.

జెలసీ వల్లనో, ఈర్షనో ద్వేషమో ఏమో గానీ ఆడవాళ్లే ఎక్కువగా ట్రోల్ చేశారు. మామూలుగా 40 50 ఏళ్లు వచ్చాక వారి పనులను వారే చేసుకోలేరు.. అలాంటి ఏజ్‌లొ ఇలా అందంగా కనిపించడానికి ఎన్నోకష్టాలు పడాల్సి వస్తుంది.. అయితే కొందరు మాత్రం పాజిటివ్ కామెంట్స్ చేశారు. మీ యాటిట్యూడ్, కాన్ఫిడెంట్ బాగా నచ్చింది. ఏజ్ అనేది జస్ట్ నంబర్ అని మీరు మరోసారి నిరూపించారంటూ కొందరు ప్రశంసించారంటూ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











