For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బట్టలు ఉన్నా లేనట్టే: ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రాశీ ఖన్నా రచ్చ.. అదొక్కటి అడ్డు లేకపోతే ఇక అంతే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, అటు అందంతోనూ.. ఇటు యాక్టింగ్‌తోనూ మెప్పిస్తూ కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ప్రవేశించిన ఈ అమ్మడు.. అప్పటి నుంచి వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతూనే ఉంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. అదే కంటిన్యూ చేస్తోంది కూడా. ఈ నేపథ్యంలో తాజాగా రాశీ ఖన్నా ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో రచ్చ రచ్చ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతున్న జీనల్ జోషి

   అలా పరిచయం.. తెలుగులోకి ఇలా ఎంటర్

  అలా పరిచయం.. తెలుగులోకి ఇలా ఎంటర్

  ‘మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో సినీ ప్రపంచంలోకి ప్రవేశించింది రాశీ ఖన్నా. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ - నాగశౌర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే బడా హీరోల సినిమాల్లో సైతం నటించింది. ఇలా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయింది.

  అన్నింట్లోనూ ఆమెనే.. వరుస సినిమాలతో

  అన్నింట్లోనూ ఆమెనే.. వరుస సినిమాలతో

  హిందీ చిత్రంతో పరిచయమై.. తెలుగులో స్థిరపడిపోయింది రాశీ ఖన్నా. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘విలన్' అనే సినిమాతో మలయాళం పరిశ్రమలోకి, ‘ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆయా భాషల్లో సైతం అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అక్కడ కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. దీంతో దక్షిణాది స్టార్ అయింది.

  వరుస హిట్లకు బ్రేక్ వేసేసిన ‘ఫేమస్ లవర్'

  వరుస హిట్లకు బ్రేక్ వేసేసిన ‘ఫేమస్ లవర్'

  రాశీ ఖన్నా ఇటీవల వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. విక్టరీ వెంకటేష్ - నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన ‘వెంకీ మామ'తో పాటు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజూ పండగే' సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఈ విజయ పరంపరకు విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్' బ్రేక్ వేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది.

  అప్పటి నుంచి మారిన తీరు... రచ్చ రచ్చ

  అప్పటి నుంచి మారిన తీరు... రచ్చ రచ్చ

  చాలా కాలంగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ హాట్ సీన్లను పెద్దగా చేసింది లేదు. కానీ, విజయ్ దేవరకొండతో చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్' మూవీలో మాత్రం ఆమె రెచ్చిపోయి నటించింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో టాప్ లెస్ బ్యాక్ షాట్‌లో కనిపించడంతో పాటు లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. అలాగే చాలా బోల్డుగా నటించింది. అప్పటి నుంచి తరచూ హాట్‌గానే కనిపిస్తోంది.

  తెలుగులో ఒక్కటే... ఆ భాషల్లో మిగతావి

  తెలుగులో ఒక్కటే... ఆ భాషల్లో మిగతావి

  ప్రస్తుతం రాశీ ఖన్నా తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమాను మాత్రమే చేస్తుంది. గోపీచంద్ - మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ‘పక్కా కమర్షియల్'లో నటిస్తోంది. ఇది తప్ప మరే సినిమానూ ఆమె ఫైనల్ చేయలేదు. అయితే, తమిళంలో మాత్రం ‘తుగ్లక్ దర్బార్', ‘అరన్మనై 3', ‘మేథావి', ‘సైతాన్ కా బచ్చా'.. మలయాళంలో ‘బ్రహ్మమ్' అనే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

  అందులో యమ బిజీ.. ఈ మధ్య పెంచింది

  అందులో యమ బిజీ.. ఈ మధ్య పెంచింది

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది రాశీ ఖన్నా. ఇందులో భాగంగానే తరచూ తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌లోని విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటోందామె.

   ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రాశీ ఖన్నా రచ్చ

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రాశీ ఖన్నా రచ్చ

  తాజాగా రాశీ ఖన్నా ఓ హాట్ ఫొటోషూట్ చేసింది. ఇందులో ఉల్లిపొర లాంటి ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌ను వేసుకున్న ఈ బ్యూటీ ఎద అందాలతో కనువిందు చేస్తోంది. అయితే, ఓ జాకెట్‌ను అడ్డుగా పెట్టి తన దేహాన్ని దాచేసింది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాశీ ఖన్నా చేసిన ఈ ఫొటోలపై స్టార్ హీరోయిన్లు సమంత, కాజల్ అగర్వాల్ కూడా స్పందించడం విశేషం.

  English summary
  Raashi Khanna is an Indian actress, and model who predominantly works in the Telugu and Tamil film industries. She debuted as an actress with the Hindi film Madras Cafe and made her debut in Telugu with the film Oohalu Gusagusalade (2014), in Tamil with the film Imaikkaa Nodigal (2018).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X