ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. నెటిజన్ల నెగెటివ్ కామెంట్లకు ‘బంగారం’ నటి కౌంటర్
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం. ఒక్కోసారి ఎంత బాధలో ఉన్నామో చెప్పినా సరే నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. బాధలను పట్టించుకోకుండా నెటిజన్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతారు. ట్రోలింగ్‌కు దిగుతుంటారు. తాజాగా ఓ బాలనటికి అలాంటి ఓ సంఘటనే ఎదురైందట. తన జీవితంలో ఎదురైన ఘటనల గురించి చెబితే నెగెటివ్ కామెంట్లతో రెచ్చిపోయారట. అసలు ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

బాలనటిగా..
బంగారం సినిమాలో మీరా చోప్రా సోదరిగా నటించి సనూష తాజాగా వార్తల్లో నిలిచింది. జీనియస్, రేణిగుంట సినిమాల్లోనూ నటిచింది. ఈ మధ్యే అంటే నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ' చిత్రంలో జర్నలిస్ట్ రమ్య పాత్రలో నటించింది. ఓ సీన్‌లో నాని ముద్దు కూడా పెట్టుకుంటాడు. ఆమె తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఇటీవల ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ.. తాను ఒకానొక సమయంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. కఠిన పరిస్థితుల కారణంగా మానసిక కుంగుబాటుకు, మనస్తాపానికి గురయ్యానని బాధనంతా వెల్లిబుచ్చుకుంది.

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు
జీవితంలో తిరిగి ఎలా నిలబడాలో, పోరాడాలో తెలియక ఇబ్బందిపడినట్లు సనూష చెప్పుకొచ్చింది. చివరకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడంతో.. భయపడ్డానని.. అనంతరం ఓ వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకున్నానని తెలిపింది. చికిత్స కారణంగా కొంతమేర తన ఆరోగ్యం మెరుగుపడిందని పేర్కొంది.

ధైర్యంగా ఉంటారనే
అయిత సనూష చెప్పిన విషయాలపై నెటిటన్లు ట్రోల్ చేశారు. వీటికి సనూష స్పందిస్తూ.. మానసిక ఆరోగ్యం గురించి ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పినందుకు పలువురు నెటిజన్లు తనపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారని చెప్పింది. మానసిక కుంగుబాటుతో ఇబ్బందిపడేవాళ్లు.. తన వీడియో చూసి కొంతమేర ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే తాను ధైర్యంగా మాట్లాడగలిగాను అంటూ కౌంటర్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











