Surekha Vani: లగ్జరీ కారు కొన్న నటి సురేఖ వాణి.. రేటు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు!
సాధారణంగా సినీ రంగంలో పని చేసే వాళ్లలో హీరోలు, హీరోయిన్లు మాత్రమే బాగా హైలైట్ అవుతూ ఉంటారు. అలాంటిది ఈ మధ్య కాంలో కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం యమ పాపులర్ అవుతోన్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు ఆఫర్లను దక్కించుకుంటోన్నారు. అలాంటి వారిలో సీనియర్ నటి సురేఖ వాణి ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. కొంత కాలంగా తరచూ తన వ్యవహార శైలితో హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సురేఖ వాణి ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!
భర్తతో కలిసి యాంకర్‌గా: సురేఖ వాణి ముందుగా యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అలా కొన్ని షోలు చేస్తోన్న సమయంలోనే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను ఆమె వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి కూడా పలు కార్యక్రమాల్లో భాగం అయింది. ఈ క్రమంలోనే 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలకు యాంకర్‌గా చేసి అప్పట్లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నటిగా మారి.. ఫుల్ బిజీ:
యాంకర్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే సురేఖ వాణికి సినిమా ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె 2005లో వచ్చిన 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నుంచి వరుసగా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసింది. తద్వారా సురేఖ నటిగానూ ఎనలేని గుర్తింపును తెచ్చుకుని బిజీగా మారింది.

భర్త మృతి.. గ్యాప్ ఇచ్చి
ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న సమయంలోనే నటి సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించారు. దీంతో ఆమెకు కోలుకోలేని షాక్ తగిలింది. ఈ దుర్ఘటన తర్వాత ఈ సీనియర్ నటి చాలా రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లి.. సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె కూతురు సుప్రీత బాసటగా నిలిచి తల్లిని కోలుకునేలా చేసింది.
కూతురితో ఎంజాయ్‌గా
భర్త మరణం తర్వాత కూతురితోనే కలిసి ఉంటోన్న సురేఖ వాణి.. కొంత కాలంగా ఆమెతో కలిసి యమ రచ్చ చేసేస్తోంది. వీళ్లిద్దరూ తరచూ ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో రెచ్చిపోతోన్నారు. ఈ క్రమంలోనే సురేఖ రెండో పెళ్లి చేసుకుంటుందని టాక్ వచ్చింది. ఇక, ఓ ఇంటర్వ్యూలో సుప్రీత తన తల్లికి బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్పి షాకిచ్చింది.

ఇప్పటికీ వరుస ఆఫర్లు
ఏజ్ పెరుగుతున్నా సురేఖ వాణికి ఇప్పటికీ తెలుగులో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె తనదైన పాత్రలను చేయడానికి సిద్ధం అవుతోంది. ఇలా ఇప్పుడు దాదాపు ఐదారు చిత్రాల్లో సురేఖ వాణి భాగం అయింది. అలాగే, కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించేందుకు రెడీ అవుతోంది. ఇలా ఇప్పటికీ ఈ సీనియర్ నటి టాలీవుడ్‌లో ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది.
లగ్జరీ కారు కొన్న సురేఖ
సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన రీతిలో అభినయాన్ని కనబరుస్తూ సందడి చేస్తోన్న సీనియర్ నటి సురేఖ వాణి.. తన పర్సనల్ లైఫ్‌ను మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె MG సిరీస్‌కు చెందిన ఓ హై ఎండ్ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఇటు సురేఖ వాణి, అటు సుప్రిత సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు.
దాని ధర ఎంతో తెలిస్తే
టాలీవుడ్ ఫేమస్ యాక్ట్రెస్ సురేఖ వాణి తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో ఆ కారు గురించి చాలా మంది ఆరా తీస్తున్నారు. ఇక, సురేఖ వాణి కొన్న కారు ధర రూ. 35 - 37 లక్షల మధ్యలో ఉంటుందని తాజాగా తెలిసింది. దీంతో చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











