షాకింగ్: విజయ్ దేవరకొండతో సుప్రిత పెళ్లి.. ఒక్క ఫొటోతో టాలీవుడ్‌లో సెన్సేషన్

సాధారణంగా సినీ రంగంలో ఉన్న చాలా మంది సెలెబ్రిటీల పిల్లలు మామూలుగానే పాపులర్ అవుతుంటారు. కానీ, కొందరు మాత్రం సెన్సేషన్‌గా మారుతుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత ఒకరు.

టీనేజ్‌లోనే సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయిన ఈ చిన్నది.. ఇప్పుడు సినిమా అవకాశాలను సైతం సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రిత టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే!

Actress Surekha Vani Daughter Supritha Wish To Marry Vijay Devarakonda

టీనేజ్‌లోనే సెన్సేషన్‌గా
సినీ జంట సురేష్ తేజ - సురేఖ వాణి కూతురిగా సుప్రిత చిన్న వయసులోనే ప్రపంచానికి తెలిసింది. అలా టీనేజ్‌లో ఉన్నప్పుడే ఈ అమ్మడు తనదైన రీతిలో అలరించి సత్తా చాటింది. ముఖ్యంగా యూట్యూబర్‌గా సుప్రిత ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అయింది. ఫలితంగా ఈ చిన్నదాని పేరు రీసౌండ్ వచ్చింది.

Actress Surekha Vani Daughter Supritha Wish To Marry Vijay Devarakonda

యూట్యూబర్‌గా సక్సెస్

2019లోనే సుప్రిత 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటనా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో తనదైన అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లలో మెరిసింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో ఇలాగే కంటిన్యూ చేస్తూ యూట్యూబర్‌గా సెన్సేషన్ అయింది.

Actress Surekha Vani Daughter Supritha Wish To Marry Vijay Devarakonda

హీరోయిన్‌గా పరిచయం
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే సుప్రితను సినీ రంగానికి పరిచయం చేయాలని సురేఖ వాణి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఆమె ఓ స్టార్ కిడ్ చేస్తోన్న చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవబోతుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సుప్రిత.. అమర్‌దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది.

Actress Surekha Vani Daughter Supritha Wish To Marry Vijay Devarakonda

అక్కడ ఫుల్ యాక్టివ్‌గా

చిన్న వయసులోనే సుప్రితకు క్రేజ్ రావడానికి సోషల్ మీడియాలో ప్రధాన కారణం అని తెలిసిందే. అందుకే ఈ అమ్మడు ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను కూడా వదులుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

Actress Surekha Vani Daughter Supritha Wish To Marry Vijay Devarakonda

ఏ హీరోతో పెళ్లి అంటూ
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సుప్రిత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ చాట్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఎంతో మంది నెటిజన్లు తమదైన రీతిలో ప్రశ్నలను అడిగారు. వీటికి సుప్రిత ఏమాత్రం సహనం కోల్పోకుండా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'నువ్వు టాలీవుడ్‌లో ఏ పెళ్లి కాని హీరోను వివాహం చేసుకుంటావు' అని అడిగాడు.

Actress Surekha Vani Daughter Supritha Wish To Marry Vijay Devarakonda

విజయ్‌తో పెళ్లికి రెడీ

టాలీవుడ్‌లో ఏ హీరోపై క్రష్ ఉందని నెటిజన్ అడిగిన ప్రశ్నకు సుప్రిత ఏమాత్రం తడబడకుండా 'విజయ్ దేవరకొండ' పేరు చెప్పింది. ఇందుకోసం అతడి ఫొటోను షేర్ చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే సమయంలో సుప్రిత చెప్పిన ఈ సమాధానం ఇప్పుడు టాలీవుడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X