Surekha Vani: మితిమీరిన సురేఖవాణి గ్లామర్ షో... దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్స్!
నటి సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమె తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, గ్లామర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు... ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసకుంది. అందం, అభినయం రెండు కలబోసిన నటిగా ఆమెకు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఇక స్విల్వర్ స్క్రీన్ పై ఎంత ఉత్సాహంగా, హుషారుగా ఉంటుందో.. సోషల్ మీడియాలోనూ అంతే జోష్ గా ఫోటోలు, వీడియోలు పెడుతూ ఉంటుంది. తాజాగా న్యూజిల్యాండ్ లో సురేఖవాణి థైస్ షోతో రచ్చ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే....
సురేఖా వాణి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. మొదట ఈ భామ టెలివిజన్ హోస్టుగా కెరీర్ ప్రారంభించి... ఆ తర్వాత మా టాకీస్, హార్ట్ బీట్ లాంటి షోలకు యాంకర్ గా వ్యవహారించింది. సీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. గ్లామర్ పాత్రల్లోనూ నటించి.. ప్రేక్షకులను అలరించింది.

సురేఖా వాణి... భద్ర, దుబాయ్ శ్రీను, యే మాయ చేశావే, దేనికైనా రెడి, పవర్ లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక సురేఖా వాణి దాదాపు 60కిపైగా సినిమాల్లో నటించింది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసే సురేఖా వాణి.. సోషల్ మీడియాలోనూ తగ్గేదేలే అన్నట్లు పోస్టులు పెడుతూ ఉంటుంది. వయసు మీద పడుతున్నా సరే అందాలు ఆరబోస్తూ.. నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.
ఇక కూతురు సుప్రితా నాయుడితో కలిసి సురేఖా వాణి.. సోషల్ మీడియాలో రచ్చ అంతా ఇంతా కాదు.. భర్త చనిపోయిన తర్వాత కూతురితో కలిసి సురేఖా వాణి జీవనం సాగిస్తుంది. ఇక మొన్నటికి మొన్న మెడలో తాళితో సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసి.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. మంగళ సూత్రం ఎందుకు వేసుకుంది.. మళ్లీ పెళ్లి చేసుకుందా అంటూ కామెంట్స్ వినిపించాయి.
ఇక తాజాగా ఈ భామ న్యూజిల్యాండ్ లో రచ్చ చేసింది. అక్కడికి వెళ్లిన సురేఖ వాణి ఓ కారుపై నుంచి దిగుతూ.. స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. కారుపై నుంచి దిగుతూ హంగామా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా తమ అభిమానులతో పంచుకుంది. #New Zealand vibes అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక సురేఖా వాణి ఈ వీడియోలో... బ్లాక్ డ్రెస్ వేసుకుని థై షో చేసింది. దీంతో నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు... పిల్ల కంటే తల్లి హాట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కొంత మంది అయితే సురేఖా వాణి కాళ్లు చూసి కోడి కాళ్లు అంటూ సెటైర్స్ వేశారు. ఏది ఏమైనా... పెట్టిన గంటలోనే ఈమె పోస్టును రకరకాల కామెంట్లతో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ వీడియో భారీగా లైక్స్, కామెంట్స్ లభించడం విశేషం. మీరు ఆ వీడియోపై ఓ లుక్ వేయండి.


Click it and Unblock the Notifications











