Surekha Vani: మగాళ్లంతా ఒక్కటే... ఆ టైంలో అలా ఉంటారంటూ సురేఖావాణి వీడియో రిలీజ్
తెలుగు వారికి నటి సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నటువంటి వారిలో సురేఖవాణి ఒకరు. గతంలో ఎన్నో చిత్రాల్లో నటించి.. క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలా అన్నట్లు అందాలు ఆరబోస్తుంది. ఈ వయసులో కూడా సురేఖవాణి అందాలు చూసి మైమరిచిపోతున్నారు. అయితే తాజాగా మగాళ్ల గురించి ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
నటి సురేఖవాణి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ భామ ఎన్నో సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట ఈ భామ టెలివిజన్ హోస్టుగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మా టాకీస్, హార్ట్ బీట్ లాంటి షోలకు యాంకర్ గా చేసింది. సీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి... గ్లామర్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గిన సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ.. వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా తన కూతురు సుప్రీతతో కలిసి చేసేటటువంటి వీడియోలు, ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. తల్లి కూతుళ్లు ఇద్దరు కలిసి.. తరచూ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ రియల్ ద్వారా మరింత పాపులారిటీ అందుకుంటున్నారు.
ఒకప్పుడు వరుస సినిమాలలో బిజీ ఆర్టిస్టుగా ఉన్న సురేఖ వాణి... ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. సురేఖ వాణి పలు రకాల డబ్ స్మాష్ వీడియోలను షేర్ చేస్తూ.. నెటిజన్స్ ను అలరిస్తూ వస్తుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేసి.. మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.ఇక ఈ వీడియోలో సురేఖవాణి మగవాళ్ళ బుద్ధి గురించి చెప్పుకువచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"సురేఖ వాణి ఆ వీడియోలో.. మగవాళ్ళందరూ ఒక్కటే మనమల్ని రీచ్ అయ్యేవరకు ఒకలాగా రీచ్ అయ్యాక మరొక లాగా ప్రవర్తిస్తూ ఉంటారంటూ మగవాళ్లంతా సేమ్.. అంటూ ఆడియోకి లిప్ మూమెంట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు నెట్టిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన కొంత మంది సురేఖ వాణిని మోసం చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొంతమంది బాగా హర్ట్ అయినట్టుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా సురేఖా వాణి వీడియో మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక సురేఖా వాణి ప్రస్తుతం విష్ణు మంచు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా భక్త కన్నప్పలో నటిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇదివరకే నెటిజన్స్ తో పంచుకుంది.


Click it and Unblock the Notifications











