Don't Miss!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పూలతో ఫూల్స్‌ను చేసేందుకు ఇలా వచ్చిందట.. అర్ధనగ్నంగా అదాశర్మ.. భలె కవర్ చేసింది!
తెలుగు తెరకు పూరి జగన్నాద్ పరిచయం చేసిన ఓ అందం పేరే అదా శర్మ. మొదటి చిత్రంతో 'హార్ట్ ఎటాక్'తోనే కుర్రాళ్లను కట్టిపడేసింది. అందాలను ఆరబోయడంలోనే కాదు.. నటనలోనూ మంచి పేరు తెచ్చుకుంది. క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి, కల్కి చిత్రాల్లో నటించి ఓ మోస్తరుగా గుర్తింపును తెచ్చుకుంది. కానీ అదాకు రావాల్సినంత పేరు మాత్రం రాలేదు. అందం ఉన్నా కానీ అదృష్టం లేకపోవడంతో అదా కాస్త వెనక్కి పడిపోయింది.
సోషల్ మీడియాలో రచ్చ..
వెండితెరపై దొరకని ఫాలోయింగ్, క్రేజ్‌ను అదా శర్మ సోషల్ మీడియాలో వెతుక్కుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ,తనలోని జిమ్నాస్టిక్ కళలను, వంటలకు సంబంధించిన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. వెరైటీ విన్యాసాలను చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.
యూట్యూబ్‌లో అలా..
ఆదా శర్మ తన వంటల ప్రతిభను నెటిజన్లకు చూపింస్తోంది. వెరైటీ వంటకాల తయారీని యూట్యూబ్ ద్వారా అందరికీ నేర్పిస్తోంది. ఆ మధ్య నోరూరించే దోశలను వేసి అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ ఇలాంటి వీడియోలు చేసుకుంటూ బిజీగా ఉంటోంది. యూట్యూబ్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది.
వెరైటీ ఫ్యాషన్..
వెరైటీ క్యాస్టూమ్, స్టైలింగ్‌తో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది. పేపర్ డ్రెస్స్‌లు, జుట్టుకు వెరైటీ రంగులు వేసుకుంటూ, పులి చర్మం లాంటి డ్రెస్సులు, పిల్లిలా తయారవ్వడం ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఫ్యాన్స్‌కు కిక్కిస్తుంది. తాజాగా అదా అలాంటి ఓ కొత్త రకమైన డ్రెస్‌ను ధరించింది.
Recommended Video
పూలతో పూల్స్..
తాజాగా అదా శర్మ అర్దనగ్నంగా దర్శనమిచ్చింది. అయితే ఈ ఫోటోలో తన అందాలకు పూలను అడ్డంగా పెట్టింది. ఈ పూలతో మిమ్మల్ని ఫూల్స్‌ను చేసేందుకు వచ్చాను అని చెబుతూ.. నిజంగానే మిమ్మల్ని ఫూల్స్‌ను చేశానా? అని అడిగింది. అయితే ఈ ఫోటోలో అదా అర్ధనగ్నంగా ఉన్నట్టే కనిపిస్తోన్నా అది నిజం కాదని అర్థమవుతోంది. అయితే ఆ పూల వెనుకున్న మర్మమేంటో ఆమెకే తెలియాలి.