ఆ కళ్లలోనే ఏదో మ్యాజిక్ ఉంది.. జూనియర్ పవర్ స్టార్ లుక్స్ వైరల్
రేణూ దేశాయ్ ఫ్యామిలీతో అడివి శేష్ చాలా క్లోజ్‌గా ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా అకీరా నందన్‌తో కలిసి అడివి శేష్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారని రేణూ దేశాయ్ కామెంట్ చేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరూ కూడా తరుచుగా కలుస్తుంటారట. తాజాగా అడివి శేష్ అకీరా నందన్ కలిసి రచ్చ చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరి ఫోటో తెగ వైరల్ అవుతోంది.

అడివి శేష్ అంటే ఇష్టమట..
అడివి శేష్ సినిమాలన్నా, అతని రచన అన్నా అకీరాకు చాలా ఇష్టమని రేణూ దేశాయ్ ఆ మధ్య చెప్పుకొచ్చింది. అడివి శేష్ హీరోగా వచ్చిన ఎవరు చిత్రాన్ని అకీరా చాలా ఇంట్రెస్టెట్‌గా చూశాడట. అలా దాదాపు కొన్ని సినిమాలను అకీరా చూస్తాడని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

అలా క్లోజ్..
ఇక తనను అకీరా అలా అభిమానిస్తున్నాడని తెలిశాక.. అడివి శేష్ చాలా క్లోజ్ అయ్యాడట. అకీరా ఎత్తు ఉంటుందో అందరికీ తెలిసిందే. వీరిద్దరు కలిస్తే బాస్కెట్ బాల్ ఆడుతారట. అలా ఈ గేమ్ కూడా ఆ ఇద్దరి దగ్గర చేసిందని రేణూ దేశాయ్ చెబుతుంటుంది.

స్పెషల్ గిఫ్ట్..
ఆ మధ్య కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో అడివి శేష్ కోసం అకీరా స్పెషల్‌గా మాస్క్‌లను గిఫ్ట్‌ను పంపించాడు. ఈ విషయాన్ని అడివి శేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. థ్యాంక్యూ డియర్ అకిరా.. నువ్ చాలా మంచి వాడివి. మళ్లీ మనిద్దరం కలిసి బాస్కెట్ బాల్ ఎప్పుడు ఆడతామోనని ఎదురుచూస్తున్నా. ఈ మాస్క్‌లు ఎంతో బాగున్నాయ్.. నాకు నచ్చాయని అకిరాకు చెప్పండని అడివి శేష్ చేసిన పోస్ట్ ఫుల్ వైరల్ అయింది.

తాజాగా అలా..
అయితే తాజాగా మళ్లీ అకీరా నందన్ అడివి శేష్ కలిశారు. ఇద్దరూ కలిసి ఏదో సందడి చేసినట్టు కనిపిస్తోంది. ఇద్దరూ మాస్కులు ధరించి ఓ సెల్ఫీకి పోజిచ్చారు. అందులో అకీరా చూపులు మాత్రం అందర్నీ ఆకట్టుకున్నాయి. చిరుత పులి చూపుల్లా ఉన్నాయని, జూనియర్ పవర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Recommended Video

నాన్న ఒడిలో..
ఈ మధ్య అకీరా నందన్ తన నాన్న పవన్ కళ్యాణ్ ఒడిలో సేదతీరాడు. నాన్న ఒళ్లో అకీరా నందర్, ఆద్యలు పడుకున్న ఫోటోను రేణూ దేశాయ్ షేర్ చేసింది. ఆ ఫోటో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇలా అకీరా ఫోటో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











