NTR, మహేష్, పవన్: ఒకప్పుడు భూమిక, ఇప్పుడు పూజా హెగ్డే.. అదే మ్యాజిక్!

జీవితంలో జరిగే కొన్ని ఘటనలు రాసిపెట్టి ఉంటాయో లేక యాదృఛ్చికంగా జరుగుతాయో తెలియదు కానీ అటువంటి వాటిలో ఒకటో రెండో అరుదైన ఘటనలు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనివిగా మిగిలిపోతాయనే చెప్పాలి. ఆ విధంగా టాలీవుడ్ లో ముగ్గురు పెద్ద స్టార్స్ నటించిన ఏడవ సినిమాల్లో హీరోయిన్ గా నటించి వారితో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్న ఘనత కేవలం భూమిక చావ్లాకే దక్కుతుంది అని చెప్పకతప్పదు. ఒకప్పుడు ఈ స్టార్ హీరోయిన్ వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకుంది. ఇక దాదాపు అదే తరహాలో పూజా హెగ్డే కూడా తన లక్కును పరీక్షించుకుంటోంది.

 అరుదైన ఘనత

అరుదైన ఘనత

భూమిక.. సూపర్ స్టార్ మహేష్ తో ఒక్కడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి, అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమాల్లో నటించి వాటితో భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఒక విధంగా ఆ స్టార్స్ అభిమానుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న భూమిక ఎప్పటికీ మర్చిపోలేని అరుదైన ఘనతను అందుకున్నారని చెప్పవచ్చు.

ఆ స్టార్స్ 7వ సినిమాలో

ఆ స్టార్స్ 7వ సినిమాలో


మొదట సుమంత్ హీరోగా కరుణాకరన్ తీసిన యువకుడు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భూమిక, ఆ తరువాత పవన్ కెరీర్ ఏడవ సినిమా ఖుషి లో ఛాన్స్ అందుకుని దానితో భారీ సక్సెస్ సొంతం చేసుకున్నారు. అయితే అప్పటికే మురారి సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్, ఆపై తన కెరీర్ ఏడవ సినిమా ఒక్కడు లో భూమిక కి ఛాన్స్ ఇచ్చారు. ఆ మూవీ తో కూడా బడా సక్సెస్ ని సొంతం చేసుకున్నారు భూమిక. అనంతరం ఎన్టీఆర్ కెరీర్ ఏడవ సినిమాగా రాజమౌళి తీసిన సింహాద్రి లో ఆమెకు ఛాన్స్ రావడం, ఆ మూవీ కూడా రిలీజ్ తరువాత భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో భూమిక స్టార్ హీరోయిన్ గా మారిపోయారు.

ఇప్పుడు పూజా హెగ్డే కూడా అదే తరహాలో

ఇప్పుడు పూజా హెగ్డే కూడా అదే తరహాలో

అయితే ఇది జరిగి ఎన్నో ఏళ్ళు గడిచింది. ఇక మళ్ళి కొన్నేళ్ల తరువాత ప్రస్తుతం అటువంటి ఒక గొప్ప ఛాన్స్ నే నేటి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే దక్కించుకోబోతున్నారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన కెరీర్ 28వ సినిమాగా త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత మూవీలో యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన పూజా హెగ్డే, త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయనున్న ఆయన కెరీర్ 28వ సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

త్వరలోనే మహేష్ 28వ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక లేటెస్ట్ ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం, త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ త్వరలో తీయనున్న భారీ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఎంపికైనట్లు టాక్. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ 28వ సినిమా కావడం విశేషం.

Recommended Video

Real Secret Behind Sudheer Babu Six Pack
 మళ్ళీ అదే మ్యాజిక్..

మళ్ళీ అదే మ్యాజిక్..

మరి ఇదే కనుక నిజం అయితే, అప్పట్లో భూమిక ఈ ముగ్గురి స్టార్స్ ఏడవ సినిమాల్లో నటించి భారీ సక్సెస్ లు సొంతం చేసుకున్న విధంగానే ఇప్పుడు పూజా హెగ్డే కూడా వీరి 28వ సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు పలువురు ప్రేక్షకాభిమానులు. ఇప్పటికే ఎన్టీఆర్ తో ఆమె నటించిన అరవింద సమేత మూవీ విడుదలై భారీ హిట్ కొట్టడంతో, ఇక మహేష్, పవన్ ల సినిమాలు కూడా రిలీజ్ తరువాత సక్సెస్ కొట్టినట్లైతే పూజా క్రేజ్ అమాంతం ఆకాశానికి చేరడం ఖాయం అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X