twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ వల్ల ఎలాంటి ఒత్తిడి లేదు, కానీ ఇపుడు భయం మొదలైంది: ‘సాహో’ డైరెక్టర్ సుజీత్

    |

    'సాహో' లాంటి రూ. 300 కోట్ల బడ్జెట్ చిత్రాన్ని... కేవలం ఒకే ఒక చిన్న సినిమా 'రన్ రాజా రన్' చేసిన దర్శకుడి చేతిలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. దర్శకుడిపై, అతడి పనితీరుపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఏ నిర్మాత కానీ, హీరో కానీ ఇలాంటి సాహసం చేయరు. అలాంటి నమ్మకాన్ని సినిమా మొదలు పెట్టడానికి ముందే కలిగించారు దర్శకుడు సుజీత్. తాజాగా టీజర్ విడుదలైన తర్వాత ఇటు ప్రేక్షకుల్లోనూ అతడిపై కాన్ఫిడెన్స్ పెరిగింది.'సాహో' టీజర్ రిలీజైన సందర్భంగా సుజీత్ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    ప్రభాస్ వల్ల ఎలాంటి ఒత్తిడి లేదు

    ప్రభాస్ వల్ల ఎలాంటి ఒత్తిడి లేదు

    బాహుబలి లాంటి సినిమా చేసిన ఒక పెద్ద హీరోను డైరెక్ట్ చేస్తున్నప్పటికీ నాపై ఎలాంటి ఒత్తిడి లేదని సుజీత్ తెలిపారు. హీరో ప్రభాస్‌తో పాటు నిర్మాతలకు నాపై, నా పనితీరుపై పూర్తి నమ్మం ఉంది. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా సాఫీగా షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు.

    ఇప్పుడు భయం మొదలైంది

    ఇప్పుడు భయం మొదలైంది

    సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులు ఎలాంటి భయం లేదు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తెలియకుండానే భయం మొదలైంది. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికీ ఎదురవుతుందని భావిస్తున్నా, సినిమా తాము అనుకున్న విధంగా అద్భుతంగా వచ్చిందని సుజీత్ చెప్పుకొచ్చారు.

    అప్పుడే కథ రాయడం మొదలు పెట్టాను

    అప్పుడే కథ రాయడం మొదలు పెట్టాను

    2014లో నా తొలి చిత్రం ‘రన్ రాజా రన్' సినిమా విడుదలైన తర్వాత ప్రభాస్ కోసం కథ రాయడం మొదలు పెట్టాను. సాధారణంగా ఒకటి రెండు నెలల్లో స్క్రిప్టు పూర్తి చేస్తాను. అయితే ‘సాహో'లో యాక్షన్ ఎపిసోడ్స్ రాయడానికి చాలా సమయం పట్టింది. 2015లో యాక్షన్ సీన్స్ నిపుణులను కలిసి చర్చించిన తర్వాత కథ పూర్తి చేశాను. 2017లో బాహుబలి 2 రిలీజ్ ముందే ప్రభాస్‌కు కథ చెప్పాను. వెంటనే ఒకే చెప్పాడని సుజీత్ తెలిపారు.

    శ్రీద్ధా కపూర్ పాత్ర కీలకంగా...

    శ్రీద్ధా కపూర్ పాత్ర కీలకంగా...

    ఈ చిత్రంలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. డిఫరెంటుగా ఉండాలనే టీజర్లో మొదట ఆమెను చూపించాం. తెలుగులో ఆమకు ఇది ది బెస్ట్ డెబ్యూ మూవీ అవుతుంది. టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని సుజీత్ వెల్లడించారు.

    వారిని తీసుకోవడం వెనక కారణం అది కాదు

    వారిని తీసుకోవడం వెనక కారణం అది కాదు

    ఈ సినిమా కోసం బాలీవుడ్ యాక్టర్లను కావాలని తీసుకోలేదు. జాకీ ష్రాఫ్‌‌, నీల్‌ నితిన్‌ ముకేశ్‌, చుంకీ పాండే, మందిరాబేడి తదితరులు నేను రాసుకున్న పాత్రలకు పర్ఫెక్టుగా సూటవుతారు కాబట్టే వారిని ఎంపిక చేయడం జరిగింది, అంతే తప్ప మరో ఉద్దేశ్యం లేదని సుజీత్ తెలిపారు. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పని చేసినట్లు ఆయన వెల్లడించారు.

    English summary
    “I did not feel the pressure to direct a big star like Prabhas. He has faith in me and my work and that matters the most to me. Also, the producers and the team members showed confidence in me. But now that the film is gearing for release in few months, I can feel the pressure,” Sujeeth said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X