ఫ్లాష్ బ్యాక్ : వెంకీ సరసన ఐశ్వర్వా రాయ్ అలా మిస్.. తెలుగులో ఏకైక చిత్రమదే!
భారతీయ సినీ ప్రేక్షకులకు ఐశ్వర్యా రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంతర్జాతీయ వేదికల్లో మెరిసిన ఐశ్వర్యా రాయ్ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ రేంజ్ స్టార్ డమ్ అనుభవించింది. దక్షిణాది ప్రేక్షకులకు సైతం ఐశ్వర్యా రాయ్ సుపరిచితురాలే. అయితే తెలుగు ప్రేక్షకులకు ఓ పూర్తి స్థాయి చిత్రంతో పలకరించలేకపోవడమే ఓ లోటు. అది కూడా తీరిపోయేది కాని జస్ట్ మిస్ అయిందంటా. ఆ కథాకమామీషు ఏంటో ఓ సారి చూద్దాం.

జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో..
మాస్ పల్స్, టేకింగ్‌లో కొత్త స్టైల్ ఇలా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్ నటించాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల అది చేజారి పోయింది. ప్రేమించుకుందాం రా సినిమా చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఫ్లాపుల్లో ఉందని..
ప్రేమించుకుందాం రా సినిమా కోసం చర్చలు జరగుతుండగా.. హీరోయిన్ కోసం గాలింపు మొదలుపెట్టారట. ఫ్యామిలీ రిలేషన్ షిప్ ఉండటంతో ఐశ్వర్యా రాయ్‌ను హీరోయిన్‌గా తీసుకుందామని జయంత్ భావించాడట. అయితే అప్పటికే వరుస ఫ్లాపులతో ఉండటంతో ఆమెను వద్దనుకున్నారట. ఆ స్థానంలో అంజలా ఝవేరి వచ్చింది. ఐశ్ మిస్ అయిపోంది.

టాప్ స్టార్‌గా ఐష్..
అయితే ఫ్లాపుల్లో ఉందని ఐష్‌ను వద్దనుకున్నారు కానీ రెండు మూడు గట్టి సినిమాలు పడటంతో ఆమె స్టేటస్ మారిపోయింది. ఎవ్వరికీ దొరకనంత ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగు తెరపై పూర్తి స్థాయిలో నటించకపోయినా ఓ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించింది. దాని వెనకాల కూడా ఓ కథ ఉంది.

వేరే హీరోయిన్ కోసం వెళ్తే...
నాగార్జున హీరోగా తెరకెక్కిస్తున్న రావోయి చందమామ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ చేయించాలని జయంత్ అనుకున్నారట. అందు కోసం ముంబై వెళ్తే అక్కడ ఐశ్వర్యా రాయ్ తారసపడిందట.
Recommended Video

నాగ్ సినిమా కోసం..
ప్రతిజింటా కోసం జయంగ్ ముంబై వస్తే అక్కడ ఐశ్వర్యా రాయ్ తారసపడిందట. ‘మీ సినిమాలో నటించమని అందర్నీ అడుగుతారు.. నన్నెప్పుడూ ఎందుకు అడగలేద'ని ఐష్ ప్రశ్నించిందంటా. ఈ స్పెషల్ సాంగ్ గురించి ఆమెకు వివరించడంతో ఆమె ఒప్పుకుందట. అలా తెలుగులో ఐష్ కనిపించిన ఏకైన చిత్రంగా రావోయి చందమామ నిలిచిపోయింది.


Click it and Unblock the Notifications











