అజిత్ ప్రేయసి గురించి తెలుసా? బ్రేకప్ తర్వాత ఆమె కెరీర్ క్లోజ్.. అన్ని వదిలేసుకొని

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు తెలుగు లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాల కోసం ఇక్కడి అభిమానులు కూడా ఎంతో ఎదురుచూస్తుంటారు. ప్రేక్షకులు కూడా అజిత్ కుమార్ సినిమాలను థియేటర్లలో వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారనే విషయం తెలిసిందే. అయితే ఈరోజు అజిత్ కుమార్ పెళ్లి రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా అజిత్ కుమార్ తన భార్య షాలినీతో కలిసి ఓ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం అది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

అజిత్ కుమార్ తన భార్య షాలినీతో కలిసి కేక్ కట్ చేశారు. తమ 25వ వివాహా వార్షికోత్సవ వేడుకలను ఇంట్లోనే జరుపుకున్నారు. ఒకరికొకరు కేక్ కట్ చేసుకొని తినిపించుకున్నారు. వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అజిత్ కుమార్ తన భార్య కోసం చాక్లెట్ కేక్ ను ప్రత్యేకంగా తెప్పించారు. తమ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన సింపుల్ వీడియోను షాలినీ అభిమానులతో పంచుకుంది. దీంతో నెట్టింట వైరల్ గా మారింది.

Ajith Kumar Relationship with Heera Rajagopal

తాలా అభిమానులు అజిత్, షాలినీకి వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 25 ఏళ్లు వివాహా జీవితాన్ని పూర్తి చేసుకొని నేటి యువతకు, కొత్త జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండటం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇక అజిత్ కుమార్ షాలినీ ఇద్దరూ 2000 ఏప్రిల్ 25న ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ పెళ్లి కావడం విశేషం.

1999లో అజిత్ కుమార్ - షాలినీ కలిసి 'అమర్ కాలం' అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా సెట్స్ లో మొదటి సారిగా ఒకరినొకరు కలుసుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఇక ఏడాదిలోనే వీరి పెళ్లి తంతు కూడా ముగిసింది. అయితే కోలీవుడ్ దర్శకుడు రమేశ్ ఖన్నా అజిత్ కుమార్ కు పెళ్లి విషయంలో ఓ సలహా ఇచ్చాడంట. హీరోయిన్లకు పెళ్లి చేసుకోకూడదని చెప్పాడంట. కానీ కొద్ది రోజులకే అజిత్ షాలినీకి ప్రపోజ్ చేశాడంట. వీరి పెళ్లి చెన్నైలో జరిగింది. 2008లో కూతురు అనౌష్క, 2015లో ఆద్విక్ జన్మించారు.

అయితే పెళ్లికి ముందే అజిత్ కుమార్ ప్రేమలో పడ్డాడని కోలీవుడ్ లో బాగా ప్రచారం. హీరా రాజగోపాల్ అనే నటితో 1990లోనే డేటింగ్ చేశారు. వీరి ప్రేమ వ్యవహారం ఎనిమిదేళ్లు కొనసాగిందంట. 1998లో రిలేషన్ షిప్ బ్రేక్ అయ్యిందంట. హీరా రాజాగోపాల్ తెలుగులోనూ చాలా సినిమాలు చేసింది. అపరాధి, పూజకు పనికి రాని పువ్వు, పబ్లిక్ రౌడీ, ఆహ్వానం, ఆవిడా మా ఆవిడే, అంతఃపురం, అల్లుడు గారు వచ్చారు వంటి సినిమాలు చేసింది. 19884 నుంచి 1999 వరకు ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉండింది. ఆ తర్వాత నుంచి సినిమాలు పూర్తిగా దూరమైపోయింది. అదే ఏడాది అజిత్ కుమార్ షాలినీ కూడా ప్రేమలో పడటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X