Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ టక్కరి దొంగ గెటప్‌లో అఖిల్.. 18 ఏళ్ళ క్రితం జరిగిన విషయం.. ఫోటో వైరల్!
అక్కినేని యువ హీరో అఖిల్ కి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో అభిమానులు ఈ విధంగా అఖిల్ ని ఎన్నడూ చూడలేదు. ఇక ఆ ఫోటో కూడా ఇప్పటిది కాదు. 18 ఏళ్ళ క్రితం దిగింది. మహేష్ బాబు వాడిన గన్, టోపితో అఖిల్ ఒక కౌ బాయ్ గెటప్ లో దర్శనమిచ్చాడు. ఇక ఆ స్టోరీ విషయానికి వెళితే..
మహేష్ బాబు 'టక్కరి దొంగ'
మహేష్ బాబు 2002లో టక్కరి దోంగ అనే సినిమా చేశాడు. అందులో మహేష్ మహేష్ సరికొత్తగా కౌ బాయ్ పాత్రలో కనిపించాడు. జయంత్ సి పరాన్జీ ఆ సినిమాను అప్పట్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. కానీ సినిమా అనుకున్నంతగా సక్సెల్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.
కౌ బాయ్ గెటప్ లో అఖిల్
అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఆ సినిమా షూటింగ్ సెట్స్ లోకి అఖిల్ తన చిన్నప్పుడు వెళ్ళాడు. కౌ బాయ్ గెటప్స్ అంటే అమితంగా ఇష్టపడే అఖిల్ నాన్న సహయంతో మహేష్ బాబును అలాగే టక్కరి దొంగ షూటింగ్ ని చూసి ఎంజాయ్ చేశాడు. ఇక అక్కడ కొన్ని ఫోటోలకు కూడా పొజిచ్చాడు.
సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్
ఒక ఫొటోలో అఖిల్ మహేష్ బాబు టోపి పెట్టుకొని చేతిలో గన్ కూడా పట్టుకున్నాడు. ఒక కౌ బాయ్ లాగా ఫీల్ అయిన అఖిల్ ఆ ఫోటోతో ఇప్పుడు జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అఖిల్ చాలా బాగున్నాడు అంటూ అమ్మయిల కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ చేస్తుండడంతో ఫోటో వైరల్ గా మారింది.
Recommended Video
ఎంత కష్టపడినా కూడా
ఇక సిసింద్రీ సినిమా ద్వారా చిన్నప్పుడే సినీ తెరకు ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పుడు హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ జనాలను అలరిస్తున్నాడు. కానీ ఎంత కష్టపడినా కూడా అఖిల్ అనుకున్నంతగా బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడం లేదు. ఇక నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను సంక్రాంతి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.