#CCL2024 ఉత్కంఠ పోరులో తెలుగు వారియర్స్ గెలుపు.. అఖిల్ టీమ్ చేతిలో సోనుసూద్ జట్టు ఓటమి

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సోను సూద్ కెప్టెన్సీలో పంజాబ్ జట్టుతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో అఖిల్ అక్కినేని నేతృత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు ఘన విజయం సాధించింది. చివరి ఓవర్‌లో 6 రన్స్ చేయాల్సి ఉండగా అఖిల్, సుధీర్ రూపంలో రెండు కీలక వికెట్లు కోల్పోయి గెలుపును సాధించింది. రోమాలు నిక్కబోడిచే విధంగా సాగిన మ్యాచ్‌ వివరాల్లోకి వెళితే..

CCL2024
తెలుగు వారియర్స్ జట్టు వివరాల్లోకి వెళితే..
అఖిల్ అక్కినేని (కెప్టెన్), సుధీర్ బాబు, సచిన్ జోషి, హరీష్ (వికెట్ కీపర్), ఎస్ఎస్ థమన్, ప్రిన్స్, అశ్విన్ బాబు, ఆది, నందకిషోర్, రఘు, సామ్రాట్ జట్టు సభ్యులుగా ఉన్నారు.

పంజాబ్ దే షేర్ జట్టు వివరాల్లోకి వెళితే..
సోనుసూద్ (కెప్టెన్), భిన్ను ధిల్లాన్, సూర్యూష్ రాయ్, రాహుల్ జైట్లీ, నింజా, అనుజ్ ఖురానా (వికెట్ కీపర్), నవ్‌రాజ్ హాన్స్, మయూర్ మెహతా, జెస్సీ గిల్, దేవ్ ఖారౌడ్, బబ్బల్ రాయ్, అపరాశక్తి ఖురానా, హార్డీ సంధూ జట్టు సభ్యులుగా ఉన్నారు.

సీసీఎల్ 2024 లీగ్‌లో భాగంగా 7వ మ్యాచ్‌లో తెలుగు వారియర్ జట్టు కెప్టెన్ అఖిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొన్నారు. దాంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు భారీ స్కోర్‌ను సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ కరణ్ అత్యధికంగా 27 పరుగులు చేయగా, నందకిషోర్ 2 వికెట్లు తీసుకోన్నాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన తెలుగు వారియర్స్ జట్టు కేవలం 20 పరుగులు ఉండగానే 4 వికెట్లు కోల్పోయింది. తమన్, అఖిల్ లాంటి టాప్ ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. తెలుగు వారియర్ జట్టులో అత్యధికంగా అశ్విన్ 43 సరుగులు చేయగా సూర్యాంశ్ 2 వికెట్లు పడగొట్టాడు.

తెలుగు వారియర్స్‌పై 13 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు మరోసారి భారీ స్కోర్ చేసింది. 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. అనుజ్ అత్యధికంగా 39 పరుగులు చేయగా.. ప్రిన్స్ 1 వికెట్ తీసుకొన్నాడు. దాంతో 106 పరుగుల భారీ లక్ష్యాన్ని తెలుగు వారియర్స్ జట్టు ముందు పంజాబ్ టీమ్ ఉంచింది.

భారీ లక్ష్య ఛేదనలో తెలుగు వారియర్స్ జట్టు ఆటగాడు తమన్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు. 31 బంతుల్లో 67 పరుగులు చేయడంతో విజయానికి చేరువగా వచ్చింది. చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సి రావడంతో టెన్షన్ మొదలైంది. అప్పుడే క్రీజులోకి వచ్చిన అఖిల్ భారీ రెండు సిక్సర్లను బాదడంతో గెలుపు మరింత చేరువైంది.

అలాంటి పరిస్థితుల్లో తెలుగు వారియర్స్ జట్టు చివరి 6 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అఖిల్ అవుట్ కావడంతో విజయం పంజాబ్ పక్షాన చేరినట్టు అనిపించింది. కానీ చివరి మూడు బంతుల్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా.. సామ్రాట్ బౌండరీ కొట్టడంతో 2 బంతులు ఉండగానే విజయం తెలుగు వారియర్స్‌ను వరించింది. తమన్, అశ్విన్‌కు బెస్ట్ ప్లేయర్ అవార్డులు లభించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X