దీపావళి స్పెషల్ పోస్టర్.. అఖిల్-పూజా హెగ్డే అల్లరి
బొమ్మరిల్లు వంటి హిట్ కొట్టి టైటిల్‌నే ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు దర్శకుడు భాస్కర్. నేటికి కూడా బొమ్మరిల్లు భాస్కర్ అని గుర్తింపు పొందుతున్నాడు. అయితే మళ్లీ బొమ్మరిల్లు వంటి హిట్ కొట్టకపోవడం అందరికీ నిరుత్సాహపరుస్తోంది. చాలా కాలం తరువాత బొమ్మరిల్లు భాస్కర్ సినిమాపై అందరికీ అంచనాలు ఓ రేంజ్‌ల్ ఉన్నాయి. అక్కినేని అఖిల్ పూజా హెగ్డేలను హీరోయిన్లు పెట్టి బొమ్మరిల్లు భాస్కర్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు
ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. పండుగ స్పెషల్ అంటూ విడుదల చేసే పోస్టర్లు మరింత రచ్చగా మారుతుంటాయి. ఆ మధ్య ఓ పోస్టర్ ఇలానే వైరల్ అయింది. పూజా తన కాళ్లను అఖిల్ మీద పెట్టడం, పోస్టర్‌లో ఫ్రెష్ నెస్ కనబడుతుండటంతో స్టిల్స్ ఫుల్ హల్చల్ చేశాయి. తాజాగా దీపావళి సందర్భంగా అదిరిపోయే స్టిల్‌ను షేర్ చేశారు.

విభా పాత్రలో పూజా హెగ్డే అల్లరి పిల్లగా అదిరిపోయే పాత్రలో నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ ఫుల్ క్లిక్ అయింది. పెళ్లి అంటే మీ ఉద్దేశ్యం ఏంటి అంటూ అఖిల్ అడగడం, పూజా చెప్పిన సమాధానం ఫుల్ వైరల్ అయింది. టీజర్ క్లిక్ అవ్వడంతో తాజాగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పూజా హెగ్డే చిచ్చుబుడ్డిని కాల్చాలని ప్రయత్నించడం, అఖిల్ తనను వెనక్కి లాగడం బాగుంది. ఇందులో అఖిల్ హెయిర్ స్టైల్ కొత్తగా ఉంది.


Click it and Unblock the Notifications











