For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Divi Vadthya కు అఖిల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్: దాన్ని చూపిస్తూ మురిసిపోయిన బ్యూటీ.. అందులో ఏముందంటే!

  |

  దివి వాద్యా.. తెలుగు వాళ్లకు ఏమాత్రం పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ రెండు రాష్ట్రాల్లో బీభత్సమైన క్రేజ్‌ను అందుకుంది. ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం అమ్మడు అదరగొట్టేసింది. తద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌తో పాటు వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో దివికి అఖిల్ సార్థక్ సర్‌ప్రైజ్ గిఫ్టును పంపించాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఆ వివరాలు మీకోసం!

  హాట్ బికినీ ఫోజులతో రెచ్చగొడుతోన్న హీరోయిన్ శ్రద్దా దాస్

  అప్పుడే ఎంట్రీ.. ఆ మూవీతో ఫేమస్

  అప్పుడే ఎంట్రీ.. ఆ మూవీతో ఫేమస్

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో లోకల్ బ్యూటీలే ఎక్కువగా సత్తా చాటుతున్నారు. అందులో దివి వాద్యా ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉన్న ఈ బ్యూటీ ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘లెట్స్ గో', ‘సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మహేశ్ చిత్రం ‘మహర్షి'తో ఒక్కసారిగా ఫేమ్ అయింది.

   బిగ్ బాస్ ఛాన్స్.. అదరగొట్టిన భామ

  బిగ్ బాస్ ఛాన్స్.. అదరగొట్టిన భామ

  హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న దివి వాద్యా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపును అందుకుంది. ఫలితంగా ఆమెకు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం దక్కింది. ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంది. అదే సమయంలో ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకులను గెలుచుకుంది. ఫలితంగా క్రేజ్‌ను అందుకుంది.

  కెరీర్‌ను మార్చిన షో.. వరుస ఆఫర్లు

  కెరీర్‌ను మార్చిన షో.. వరుస ఆఫర్లు

  బిగ్ బాస్ షోలో దివి వాద్యా ఆటతీరును చూసిన వారంతా ఆమె ఫినాలేకు చేరుతుందని అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితేనేం.. బయటకు వచ్చినప్పటి నుంచే వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. అదే సమయంలో కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

  దివికి చిరంజీవి ఫ్లాట్.. సినిమా ఛాన్స్

  దివికి చిరంజీవి ఫ్లాట్.. సినిమా ఛాన్స్

  బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే రోజు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఆరోజు దివి వాద్యాను చూసి ఆయన ఫ్లాటైపోయారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఈ స్టార్ హీరో.. తాను చేయబోయే సినిమా (వేదాళం రీమేక్)లో ఆమెకు ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. మెహర్ రమేశ్ తెరకెక్కిస్తోన్న ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించనుందామె.

   ‘క్యాబ్ స్టోరీస్' ఆకట్టుకున్న అమ్మడు

  ‘క్యాబ్ స్టోరీస్' ఆకట్టుకున్న అమ్మడు

  బిగ్ బాస్ తర్వాత వరుస సినిమాలతో రచ్చ చేస్తోన్న దివి వాద్యా.. ఇటీవల ‘క్యాబ్ స్టోరీస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవీఎన్ రాజేష్ రూపొందించిన ఈ సినిమా స్పార్క్ ఓటీటీలో విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. అదే సమయంలో దివి వాద్యా నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంతో ఆమె పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగిపోతోందని చెప్పొచ్చు.

   అందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది

  అందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది

  ప్రస్తుతం ఓ లవ్ ఎంటర్‌టైనర్ మూవీతో పాటు ‘లంబసింగి' అనే యూత్‌ఫుల్ చిత్రంలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది దివి వాద్యా. అయిన్పటికీ సోషల్ మీడియాలో సైతం ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టుతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదలుతూ రచ్చ చేస్తోంది. ఫలితంగా తరచూ హైలైట్ అవుతోంది.

  Bigg Boss నుండి వచ్చాక కెరీర్ ఉండదు అంటారు.. కానీ Divi Vadthya విషయం లో ఇది తప్పు
  దివికి అఖిల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. చూపిస్తూ

  దివికి అఖిల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. చూపిస్తూ

  తెలుగు అందం దివి వాద్యాకు తాజాగా బిగ్ బాస్ ఫేం అఖిల్ సార్థక్ ఓ సర్‌ప్రైజ్ గిఫ్టును పంపించాడు. అందులో ఆమె గులాబీ పువ్వు పట్టుకుని కొంటెగా చూస్తోన్న ఫొటో ఆర్ట్ ఉంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిందీ బ్యూటీ. అంతేకాదు, ఇందులోనే అఖిల్ సార్థక్‌కు స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood Actress, Bigg Boss Fame Divi Vadthya Now Busy With So Many Films. Recently Akhil Sarthak Send Special Gift to her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X