అకీరాలో ఆ టాలెంట్ కూడా ఉందా!.. కొంపదీసి అలా సెటిల్ అవుతాడా ఏంటి?
రేణూ దేశాయ్, అకీరా నందన్, ఆద్యల గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, రాసే కవిత్వాలు, పెట్టే కామెంట్స్ తెగ వైరల్ అవుతుంటాయి. ఇక అకీరా, ఆద్యల గురించి చెప్పే ఇంట్రెస్టింగ్ స్టోరీలు మరింతగా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో ఆద్య వంటలు నేర్చుకోవడం, అడివి శేష్ కోసం అకీరా మాస్కులు పంచడం గురించి రేణూ దేశాయ్ చేసిన పోస్ట్‌లు బాగా వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్..
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు, లొకేషన్ల వేట, వర్కౌట్ల ఇన్ఫర్మేషన్, వెకేషన్‌లకు వెళితే అక్కడి సంగతులు ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది. ఇక తన పిల్లలకు ఉన్న ప్రత్యేక టాలెంట్స్ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటుంది.

ఆద్యలో స్పెషల్ అదే..
ఆద్యలో ఫోటోగ్రఫర్ అయ్యే లక్షణాలున్నాయని రేణూ దేశాయ్ చెబుతూ ఉంటుంది. తాను సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల్లో దాదాపు ఆద్య తీసినవే ఎక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చింది. ఫోటోలు కూడా బాగా తీస్తుందని కూతురికి కితాబిచ్చింది. అయితే అకీరా గురించి మాత్రం వెరైటీగా చెబుతుంది.

క్లారిటీ లేదు..
అకీరా పెద్దయ్యాక ఏమవుతాడు? అనే ప్రశ్నకు రేణూ దేశాయ్ వెరైటీగా సమాధానం ఇచ్చింది. అకీరా కలలు, కోరికలు వయసును బట్టి మారిపోతూ ఉంటాయని, ఒక్కోసారి హీరోను కావాలంటాడు. ఇంకోసారి డాక్టర్ అంటాడు.. మరోసారి స్పోర్ట్స్ మెన్ అంటాడు.. ఇంజనీర్ అంటాడు ఇలా అన్ని అవుతాను అని అంటాడు. కానీ చివరకు ఏం అవుతాడో చెప్పడం కష్టమని ఓ సందర్భంలో రేణూ దేశాయ్ తెలిపింది.
Recommended Video

అకీరా తీసిన ఫోటో..
మామూలుగా అయితే ఆద్య ఎప్పుడూ ఫోటోలను తీస్తుంది. కానీ ఈ సారి కాస్త వెరైటీగా కొత్తగా అకీరా తీశాడట. ఇదే విషయాన్ని రేణూ దేశాయ్ చెబుతూ అకీరా తీసిన తన ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోను చూస్తే ఓ ప్రొఫెషన్ ఫోటోగ్రాఫర్ తీసినట్టుగానే అనిపిస్తోంది. ఇక హీరోగా కాకుండా ఫోటోగ్రఫీలో పట్టా సంపాదించి అలా సెటిల్ అవుతాడా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొత్తానికి అకీరాలో అన్ని రకాలు టాలెంట్స్ ఉన్నాయని అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











