అకీరా మంచి మనసు.. అడివి శేష్‌కు స్పెషల్ గిఫ్ట్
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోకస్ కాడు. కానీ అప్పుడప్పుడు బయటకు వచ్చే అకీరా నందన్ వార్తలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. పండగలకో పబ్బాలకో అలా అరుదుగా అకీరా ఫోటోలు బయటకు వస్తాయి. అయితే అకీరా నందన్‌కు ఇష్టమైన హీరో ఎవరై ఉంటారని అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రేణూ దేశాయే ప్రకటించింది. అకీరా తనకు ఇష్టమైన హీరోను కలిశాడని ఆ మధ్య షేర్ చేసిన ఫోటోలు ఎంతగానో వైరల్ అయ్యాయి.
క్షణం, గూఢచారి, ఎవరు వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారిపోయాడు అడివి శేష్. అడివి శేష్ సినిమాలన్నా, అతని రచన అన్నా అకీరాకు చాలా ఇష్టమట. చివరగా వచ్చిన ఎవరు చిత్రాన్ని అకీరా చాలా ఇంట్రెస్టెట్‌గా చూశాడట. ఈ విషయాలన్నీ రేణూ దేశాయ్ అప్పట్లో సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాలు తెలిసిన అడివి శేష్ అకీరాను ప్రత్యేకంగా కలిశాడు.

ఈ ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు కూడా. అకీరా ఎత్తు ఉంటుందో అందరికీ తెలిసిందే. వీరిద్దరు కలిస్తే బాస్కెట్ బాల్ ఆడుతారట. తాజాగా అడివి శేష్ కోసం అకీరా స్పెషల్‌గా మాస్క్‌లను గిఫ్ట్‌ను పంపించాడట. ఈ విషయాన్ని అడివి శేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'థ్యాంక్యూ డియర్ అకిరా.. నువ్ చాలా మంచి వాడివి. మళ్లీ మనిద్దరం కలిసి బాస్కెట్ బాల్ ఎప్పుడు ఆడతామోనని ఎదురుచూస్తున్నా. ఈ మాస్క్‌లు ఎంతో బాగున్నాయ్.. నాకు నచ్చాయని అకిరాకు చెప్పండ'ని రేణూ దేశాయ్‌ను కోరాడు. దీనికి రేణూ దేశాయ్ స్పందిస్తూ.. 'నీకు నచ్చినందుకు చాలా సంతోషం.. యాధృచ్చికంగా అకీరా ఇప్పుడు బాస్కెట్ బాలే ఆడుతున్నాడు. మీరు వచ్చినప్పుడు మళ్లీ ఆడండి' అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











