twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Nagarjuna: ఈ 60ఏళ్ళ నవ మన్మథుడి సీక్రెట్ అదే..

    |

    మన్మథుడు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది అక్కినేని నాగార్జున అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే కింగ్, మాస్ అనే పేర్లకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కింగ్ నాగార్జున గత కొన్ని దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్నాడు. ఈ శివ ట్రెండ్ సెట్టర్ కి నేటితో 61ఏళ్ళు నిండాయి. దీంతో సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    ఇండస్ట్రీని ఒక్కసారిగా కదిలించిన హీరో..

    ఇండస్ట్రీని ఒక్కసారిగా కదిలించిన హీరో..

    అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆ తరువాత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కినేని వంశానికి ఏఎన్నార్ వేసిన బాటకు ఆయన తనదైన శైలిలో కొత్త దారులు వేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన శివ సినిమాతో ఇండస్ట్రీని ఒక్కసారిగా కదిలించేశారు.

     ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా..

    ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా..

    1986 విక్రమ్ సినిమా ద్వారా మొదటిసారి కథనాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున కెరీర్ మొదట్లో కొన్ని అపజయాలను ఎదుర్కొన్నాడు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. గ్యాప్ లేకుండా ఒక ఏడాదిలో రెండు మూడు సినిమాలు చేస్తే అందులో ఒకదానికి మరొకటి సంబంధం ఉండకుండా చూసుకోవడంలో ఆయన స్టైలే వేరు.

     డైట్ సీక్రెట్..

    డైట్ సీక్రెట్..

    ఇక నాగార్జునకు 61 ఏళ్ళ వయసు అంటే నమ్మడం కష్టంగానే ఉంటుంది. నిత్య యవ్వనుడిగా ఇంకా నేటితరం జనరేషన్స్ కి ఆయన సవాల్ విసురుతూనే ఉన్నారు. రోజు ఒక అరగంట వ్యయామం చేసి హ్యాపీగా ఉండడమే తన డైట్ సీక్రెట్ అని చెబుతుంటారు.

    సరికొత్త ట్రెండ్ సెట్టర్..

    సరికొత్త ట్రెండ్ సెట్టర్..

    అన్నమ్మయ్య, మన్మథుడు, సూపర్, శ్రీరామదాసు ఇలా వైవిధ్యమైన సినిమాలను చేసి సరికొత్తగా ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి. దర్శకుడి పని తీరు నచ్చితే అవకాశాలు ఇవ్వడంలో నాగ్ ముందుంటాడు. ప్రతిభ ఉన్న దర్శకులను స్టార్ హీరోలు పక్కన పెడితే బంగార్రాజు మాత్రం కథ నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇక నాగార్జున ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అభిమానులు విషెస్ అందిస్తున్నారు.

    Recommended Video

    Celebrities Green India Challenge
    హోస్ట్ లో కూడా బెస్ట్..

    హోస్ట్ లో కూడా బెస్ట్..

    మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ వంటి రియాలిటీ టాలెంటెడ్ షోలకు హోస్ట్ గా కూడా నాగార్జున ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ 3 క్లిక్కవ్వడంతో మరోసారి నాలుగవ సిజన్ కి కూడా ఆయనే వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే..

    English summary
    Needless to say, Akkineni Nagarjuna was immediately reminiscent of manmathudu. King Nagarjuna, who has also become a brand ambassador for the names King and Mass, has been spinning the wheel as a South Industry star hero for the past few decades. Today marks the 61st anniversary of this Shiva trend setter. With this, movie celebrities and fans are sending their best wishes through social media,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X