ఆరు పదుల వయసులో నాగ్.. అక్కినేని అభిమానుల డిమాండ్స్
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఇప్పటికీ యంగ్ లుక్ లోనే కనిపిస్తున్నారు. నవ మన్మథుడిగా భారీ మహిళా ఆడియన్స్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ హీరో వయసు గురించి మాట్లాడుకుంటే మాత్రం షాక్ కావాల్సిందే. మరికొద్ది రోజుల్లోనే సక్సెస్ ఫుల్‌గా ఆరు పదుల వయసులోకి అడుగు పెట్టబోతున్నాడు నాగార్జున. ఆగస్టు 29 వ తేదీన ఆయన 60 వ పుట్టిన రోజు. దీంతో ఈ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని అక్కినేని అభిమానుల డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఇంకా నెల రోజులే సమయం ఉండటంతో ఇప్పటి నుంచే నాగ్ పుట్టిన రోజు వేడుకపై చర్చలు మొదలయ్యాయి.
పైగా ఈ ఆరు పదుల వయసులో మరోసారి నాగార్జున మన్మథుడిగా ప్రేక్షకుల ముందుకు రానుండటం జనాల్లో ఆసక్తి రేపుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మన్మథుడు 2 చిత్రంలో రొమాంటిక్ రోల్ ప్లే చేస్తున్నాడు నాగార్జున. ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మన్మథుడు 2 లో నాగ్ రొమాంటిక్ డోస్ ఎలా ఉండనుందో తెలియజేసింది. ఆగస్టు 9 వ తేదీన మన్మథుడు 2 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మన్మథుడు 2, నాగార్జున పుట్టిన రోజు వేడుక రెండూ కలిపి సక్సెస్ ఫుల్‌గా నిర్వహించాలని నాగ్ అభిమానుల నుంచి వినతులు వస్తున్నాయట. మరోవైపు నాగార్జున అండ్ టీమ్ కూడా నాగ్@ 60 బర్త్ డే వేడుక ఘనంగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

ఫిట్‌నెస్ పరంగా కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్న నాగార్జున.. వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం మన్మథుడు 2 షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన ఈ సినిమా పూర్తికాగానే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా చేయనున్నాడు. ఇందులో నాగార్జున సరసన అనుష్క నటించనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











