వైరల్‌గా బాటిల్ క్యాప్ ఛాలెంజ్... అర్జున్, అక్షయ్ కుమార్ థ్రిల్లింగ్.. షాకింగ్‌గా..
ఇటీవల కాలంలో రకరకాల ఛాలెంజ్‌లు నెటిజన్లకు మంచి స్ఫూర్తిని కలిగించాయి. వాటిలో ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ లాంటివి సెలబ్రిటీలను ఆకర్షించాయి. అదే కోవలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌గా నిలుస్తున్న ఛాలెంజ్ బ్యాటిల్ క్యాప్ ఛాలెంజ్ (#BottleCapChallenge). ఇది ఫిట్‌నెస్‌కు ఓ అగ్నిపరీక్షగా నిలిచింది. ప్రస్తుతం ఈ ఛాలెంజ్‌ను హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సవాల్‌గా స్వీకరిస్తున్నారు. ఇంతకు బ్యాటిల్ క్యాప్ ఛాలెంజ్ ఏమిటంటే..

బాటిల్ క్యాప్ ఛాలెంజ్ అంటే
ఏదైనా బాటిల్‌ను చేతితో కాకుండా కాలితో కిక్ కొట్టి తీయాల్సి ఉంటుంది. ఆ పోటీలో బాటిల్ కింద పడకుండా కాలితో తన్ని మూతను తీయాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సౌత్ స్టార్ అర్జున్ సర్జా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు.
స్టైలిష్‌గా అర్జున్ సర్జా
అర్జున్ సర్జా ఈ ఫిట్‌ను చాలా క్రేజీగా ఫినిష్ చేశారు. బాటిల్ మూతను కిక్‌తో ఎగురకొట్టి తన స్టామినాను రుజువు చేసుకొన్నారు. చాలా యంగ్‌గా, ఫ్రెష్‌గా ఆయన కనిపించారు. అర్జున్ చేసిన ఛాలెంజ్ ఇదే..
అక్షయ్ కుమార్ ఛాలెంజ్ స్వీకరణ
బ్యాటిల్ క్యాప్ ఛాలెంజ్‌ను చేయలేకుండా ఉండలేకపోయాను. నా యాక్షన్ గురు జాసన్ స్థాటమ్ నుంచి ప్రేరణ పొందాను. ఈ ఛాలెంజ్‌ను మీరు స్వీకరించండి.. ఏదైనా నన్ను కదిలిస్తే దానిని రీపోస్ట్ చేస్తాను. రీ ట్వీట్ చేస్తాను అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.
జాన్ మేయర్ ఛాలెంజ్
బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌ను నా స్నేహితుడు మొదట చేశాడు. ఆ తర్వాత మరో స్నేహితుడిని చూసి స్ఫూర్తి పొందాను. ఆ తర్వాత వీరిద్దరి అనుసరించి నేను ఛాలెంజ్‌ను స్వీకరించాను. ఇదే నా ఛాలెంజ్. మీరు చూసి స్ఫూర్తి పొందండి అని జాన్ మేయర్ పేర్కొన్నారు.
డానీ యెన్ బ్యాటిల్ క్యాప్ ఛాలెంజ్
డానీ యెన్ అనే హాలీవుడ్ యాక్టర్ కూడా క్రేజీగా ఈ ఛాలెంజ్‌ను ఫినిష్ చేశారు. కళ్లకు గంతలు కట్టుకొని బాటిల్ నుంచి క్యాప్‌ను కిక్‌తో ఎగురగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది.
ఆష్లే నోసెరా ఛాలెంజ్
హాలీవుడ్ యాక్షన్ హీరోయిన్ ఆష్లే నోసెరా కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఒకే కిక్‌తో బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. అంతేకాకుండా మరెందరికో సవాల్‌గా నిలిచారు.


Click it and Unblock the Notifications











