Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తెరపైకి కొత్త చర్చ: అంతా ఓకే కానీ.. ఆ విషయంలో మాత్రం బన్నీ ఫ్యాన్స్‌లో నిరాశ.!
కొద్ది రోజుల క్రితం వరకూ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూకుడు ప్రదర్శించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే, తన గత చిత్రం 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' తర్వాత మాత్రం కొంచెం నెమ్మదించాడు. ఇది విడుదలై ఏడాది గడుస్తున్నా.. బన్నీ నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ, అతడు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో..' అనే సినిమా చేస్తున్నాడు. ఇది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు సరికొత్త చర్చను తెరపైకి తీసుకు వచ్చారు. దీన్ని ప్రస్తావిస్తూ వాళ్లంతా నిరాశకు గురవుతున్నారు. ఇంతకీ వాళ్లు ఏ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..?
సెంటిమెంట్‌తో కొట్టి హ్యాట్రిక్ చేస్తారట
గతంలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. దీంతో ఈ కలయికపై అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న ‘అల.. వైకుంఠపురములో..' కూడా పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించి, హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని చూస్తున్నారు ఈ ఇద్దరు స్టార్లు.
బన్నీ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి
చాలా కాలంగా తమ అభిమాన హీరో సినిమా విడుదల కాలేదు అని అనుకుంటున్నారో ఏమో.. ‘అల.. వైకుంఠపురములో..' నుంచి ఏ అప్డేట్ వచ్చినా బన్నీ ఫ్యాన్స్ ఫుల్ యాక్టివ్ అయిపోతున్నారు. అందుకే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తున్నారు. అందుకే ఈ సినిమాలోని ‘సామజవరగమన' రికార్డులు సృష్టించింది.
టీజర్ మాత్రం ఓ రేంజ్లో వెళ్తోంది
ఇక, ఈ సినిమా నుంచి వచ్చే టీజర్ కోసం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో బుధవారం ‘అల.. వైకుంఠపురములో..' టీజర్ విడుదలైంది. ఇది అలా యూట్యూబ్‌లో పెట్టారో లేదో.. భారీ స్థాయిలో వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇందులో డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఆ ఒక్క విషయంలో బన్నీ ఫ్యాన్స్ నిరాశ
ఈ టీజర్ చూసిన తర్వాత బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారని అంతా అనుకున్నారు. కానీ, వాళ్లు సరికొత్త చర్చను తెరపైకి తీసుకు వచ్చారు. టీజర్లో అన్నీ బాగున్నాయి కానీ, అల్లు అర్జున్ మాత్రం అంత గ్లామర్‌గా కనిపించడం లేదని నిరాశకు గురవుతున్నారు. ఇది ప్లాన్‌లో భాగమో.. మరేదో కారణమో తెలియదు కానీ.. చాలా మంది దీనిపై పెదవి విరుస్తున్నారు.
వైకుంఠపురములో బన్నీతో వీళ్లంతా
‘అల.. వైకుంఠపురములో 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బన్నీ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, టబు, నివేథా పేతురాజ్, నవదీప్, సముద్రఖని, మురళీ శర్మ తదితర నటులు కనిపించనున్నారు.