అల.. వైకుంఠపురములో మరో న్యూ రికార్డు.. నెవర్ బిఫోర్ అనేలా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం 'అల.. వైకుంఠపురములో..' ఈ సినిమాతో త్రివిక్రమ్ ఫామ్ లోకి రావడమే కాకుండా అల్లు అర్జున్ అసలైన స్టామినా ఏమిటో మరోసారి బాక్సాఫీస్ వద్ద చాలా క్లారిటీగా అర్థమయ్యింది. అయితే 2020లోనే కాకుండా 2021లో కూడా సినిమాకు సంబంధించిన రికార్డులు ఎదో ఒకటి హాట్ టాపిక్ గా అవుతూనే ఉన్నాయి.
అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా విజయంలో థమన్ పాత్ర ఎంతో ఉంది. అయితే సినిమాలోని ప్రతి పాట కూడా యూ ట్యూబ్ లో ఒక వండర్ క్రియేట్ చేసింది. అందులో బుట్టబొమ్మ కూడా ఇటీవల ఒక మైల్ స్టోన్ ను అందుకుంది. బుట్టబొమ్మ పాటకు యూ ట్యూబ్ లో ఇటీవల 500మిలియన్ వ్యూవ్స్ ను అందుకుంది.

గత ఏడాది బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్ గా క్రేజ్ అందుకోగా ఇప్పుడు మరో సాంగ్ కొత్త రికార్డును అందుకోవడంతో సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. ఇక థమన్ ఆ సినిమా ద్వారానే మరిన్ని అవకాశాలు అందుకున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో కూడా థమన్ మరింత బిజీగా మారనున్నాడు. చూడాలి మరి ఆ సినిమాల పాటలు ఏ రేంజ్ లో క్లిక్కవుతాయో.


Click it and Unblock the Notifications











