For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కింగ్ ఇన్ యాక్షన్.. అలీ రెజా పోస్ట్ వైరల్

    |

    బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఈ మధ్య మరీ ఎక్కువగా రోడ్ ట్రిప్స్ వేస్తూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన భార్య మసూమతో కలసి కారులో షికారుకు వెళ్లాడు. తాజాగా మళ్లీ మనాలి వెళ్లినట్టు తెలుస్తోంది. డెహ్రాడూన్, మనాలి వెళ్లినట్టు అక్కడి వాతావరణం, రోడ్లు ఎలా ఉన్నాయో చెబుతూ వీడియోలను షేర్ చేస్తూ వచ్చాడు. అయితే అలీ రెజా తాజాగా చేసిన ఓ పోస్ట్ మాత్రం అందరీలోనూ ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది.

    అలీ రెజా ప్రస్తుతం నాగార్జునతో కలిసి నటిస్తోన్న సంగతి తెలిసిందే. వైల్డ్ డాగ్ చిత్రంతో అలీ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్ కూడా బాగానే వైరల్ అయింది. అయితే ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం మనాలీలో షూటింగ్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రంగంలోకి దిగిన నాగార్జున ఫోటోను అలీ రెజా పోస్ట్ చేశారు. కింగ్ ఇన్ యాక్షన్ అంటూ కామెంట్ పెట్టి వైల్డ్ డాగ్ లొకేషన్స్‌లోని స్టిల్‌ను షేర్ చేశాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది.

    Ali Reza Shares Nagarjuna Pic On Wild Dog Set

    అలా నాగార్జున ఫోటోను షేర్ చేయడంత ఇక ఈ వారం నాగార్జున బిగ్ బాస్ వేదికపై కనపడడేమోనన్న అనుమానం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. గత వారం కూడా ఇలాంటి కామెంట్లే వచ్చాయి. కానీ నాగార్జున వీకెండ్‌కు బిగ్ బాస్ కోసం హైద్రాబాద్‌లో వాలిపోతాడట. కానీ ఇవేమీ పట్టించుకోని కొందరు నాగార్జున వీకెండ్ షోలో కనబడడు.. అందుకు బదులుగా రోజా వస్తుందని పులిహోర కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అలీ రెజా పెట్టిన చిచ్చు మాత్రం బాగానే రేగింది.

    English summary
    Ali Reza Shares Nagarjuna Pic On Wild Dog Set, Ali Reza says that King in Action. ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X