అలియాభట్‌ వద్ద అరుదైన సంపద.. RRR హీరోయిన్ వద్ద అదరగొట్టే ఐదు ఆస్తులు. వాటి విలువ ఎంతంటే

బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్‌ తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకొంటున్నారు. అందం, అభినయంతో తన ప్రతిభను చాటుకొంటూ ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయారు. అయితే రోజు రోజుకు పెరుగుతున్న అభిమాన గణం మాదిరిగానే ఆమె సంపాదన కూడా పెరిగిపోతున్నట్టే కనిపిస్తున్నది. అయితే ప్రస్తుతం ఆలియా భట్ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR‌లో నటిస్తున్న అలియాభట్ వద్ద ఉన్న అరుదైన వస్తువులు ఏమిటంటే..

ఎద అందాలతో ఈషా గుప్తా హల్‌చల్.. గరం గరంగా లేటేస్ట్ ఫోటోషూట్

 అలియాభట్ వద్ద పాపులర్ బ్రాండ్స్

అలియాభట్ వద్ద పాపులర్ బ్రాండ్స్

అలియాభట్‌ వద్ద అత్యంత పాపులారిటీ ఉన్న బ్రాండ్స్‌ అంటే అలియాభట్‌కు చాలా ఇష్టం. ఆమె వద్ద బలెనిసియాగా, ఛానెల్, సెయింట్ లారెంట్ లాంటి అంతర్జాతీయ కంపెనీల ఖరీదైన కలెక్షన్లు ఉన్నాయి. ఆమె వద్ద ఉ్న లూయిస్ వీట్టన్ బ్యాగ్ కూడా చాలా ఖరీదైనది అని ఆమె సన్నిహితులు చెప్పుకొంటారు. ఆలియా భట్ చేతిలో ఉండే బ్యాగ్ ఖరీదు రూ.1.75 లక్షలు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 ముంబైలో విలాసవంతమైన బంగ్లా

ముంబైలో విలాసవంతమైన బంగ్లా

అలాగే వరుస విజయాలతో దూసుకెళ్తున్న అలియాభట్ ఇటీవల ముంబైలో లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ముంబైలోని విలాసవంతమైన ప్రాంతంలోని ఫ్లాట్ వైశాల్యం 2300 చదరపు ఫీట్లు. ఈ ఫ్లాట్‌లోని అలంకరణకే భారీగా ఖర్చు చేసినట్టు సమాచారం. ముంబైలోని అలియాభట్ ఫ్లాట్ ఖరీదు రూ.13.11 కోట్లు అని స్నేహితులు వెల్లడించారు.

రణ్‌బీర్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్

రణ్‌బీర్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్

బాలీవుడ్‌లో యువ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో అలియాభట్ ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ప్రియుడికి దగ్గరా ఉండాలనే కోరికతో ఇటీవల కీలక నిర్ణయం తీసుకొన్నారు. రణ్‌బీర్ ఉండే అపార్ట్‌మెంట్‌లో 2460 చదరపు ఫీట్ల వైశాల్యం ఉన్న మరో ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. దాని ఖరీదు రూ.32 కోట్లు అని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

అలియాభట్ వద్ద విలాసవంతమైన కార్లు

అలియాభట్ వద్ద విలాసవంతమైన కార్లు

అలియాభట్‌కు విలాసవంతమైన వాహనాలు అంటే కూడా చాలా మక్కువ. ఆమె వద్ద ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్, వోగ్, బీఎండబ్ల్యూ 7 సిరీస్ లాంటి కార్లు ఆమె వద్ద ఉన్నాయి. వైట్ కలర్‌లో ఉండే రేంజ్ రోవర్ వోగ్ కారు ఖరీదు రూ.1.88 కోట్లు, బీఎండబ్ల్యూ 7 సిరీస్ ఖరీదు రూ.1.37 కోట్లు అని ముంబై మీడియా పేర్కొన్నది.

Recommended Video

Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
లండన్‌లో కళ్లు చెదిరే ఫ్లాట్

లండన్‌లో కళ్లు చెదిరే ఫ్లాట్

స్వదేశంలోనే కాకుండా.. విదేశాల్లో కూడా అలియాభట్‌కు ఆస్తులు ఉన్నాయి. తనకు లండన్‌లో కళ్లు చెదిరిపోయే భవనం ఉందని ఇటీవల ఇంటర్వ్యూలో అలియాభట్ వెల్లడించింది. లండన్‌లోని కోవెంట్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న ఇంటిలో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. ఆ ఇంటి ఖరీదు రూ.16 కోట్లు అని మీడియా లెక్క కట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X