సీతగా నిండైనా దుస్తులతో అలా బికినీలో ఇలా.. స్విమ్మింగ్ పూల్‌లో అలియా భట్
బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ క్రమంలో అలియా భట్ ఇండియన్ స్క్రీన్‌ను ఏలేస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు రెడీ అవుతోంది. ఇక బాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్సీ డైరెక్టర్ అయిన సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలోనూ నటిస్తోంది. ఇక అలియా తన సినీ వ్యవహారాలతోనే కాకుండా.. పర్సనల్ విషయాలతోనూ ఫేమస్ అవుతూ ఉంటుంది.

ప్యాన్ ఇండియన్ హీరోయిన్..
అలియా భట్ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ హీరోయిన్. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించనుంది. ఈ మధ్యే వదిలిన లుక్ అందరినీ కట్టిపడేసింది. రాజమౌళి సీత పాత్రను తీర్చిదిద్డిన తీరు, ఆమె మేకప్, గెటప్ అన్నీ కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి.

వివాదాస్పద చిత్రంలో..
ఇక అలియా గంగూభాయ్ కథియావాడి చిత్రంలోనూ నటిస్తోంది. ముంబై రెడ్ లైట్ ఏరియాను ఏలిన గంగూభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ రాబోతోంది. ఈ మధ్యే వదిలిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. గంగూభాయ్‌గా అలియా నటనకు అందరూఫిదా అయ్యారు.

పెళ్లి అంటూ రూమర్లు..
అలియా భట్ రణ్ బీర్ కపూర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ అనేది ఇండియాకు రాకపోయి ఉంటే గతేడాదిలోనే తమ పెళ్లి జరిగిపోయేదని రణ్ బీర్ కపూర్ ఆ మధ్య చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

మిస్ అవుతున్నా..
రణ్ బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ రావడం, ఆయన క్వారంటైన్‌కే పరిమితం అవ్వడంతో అలియా తెగ మిస్ అయిపోయింది. ఈ మేరకు రణ్ బీర్‌తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ మిస్ అవుతున్నానంటూ అలియా ఓ పోస్ట్ చేసింది. తాజాగా అలియా అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
సీత పాత్రలో అలియా నిండుగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.తాజాగా అలియా స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తోంది. బికినీలో దర్శనమిచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం అలియా భట్ బికినీ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











