ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న అల్లు అరవింద్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ 'ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019' అవార్డు అందుకున్నారు. ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకానమీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన తీసుకున్నారు. సోమవారం రోజు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అరవింద్‌కి ఈ అవార్డు ప్రధానం చేశారు.
సోషియల్ డెవలప్‌మెంట్, కమ్మునిటీ సర్వీస్ చేసిన ఉత్తములకు ఈ అవార్డు ఇస్తుంటారు. ఈ అవార్డ్స్‌ను ఈ ఏడాది నలుగురు ముఖ్యమంత్రలు, కొంతమంది స్పోర్ట్స్ ఛాంపియన్స్ స్వీకరించబోతున్నారు. వారిలో అల్లు అరవింద్ సినిమా రంగానికి చెందిన వ్యక్తి కేటగిరీలో అవార్డ్ అందుకున్నారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహా పలు సామాజిక సేవా సేవలు చేసినందుకు గాను ఆయనను ఈ అవార్డు వరించింది. అవార్డు అందుకున్న అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డును ప్రేక్షకులకు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు, రక్త దానం చేసిన దాతలకు అంకితమిస్తున్నా. భవిష్యత్తులోను సమాజం కోసం నా సేవలు కొనసాగిస్తా'' అని తెలిపారు.
తెలుగులోనే గాక తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాలను నిర్మించారు అల్లు అరవింద్. ఆ నాటి బడా హీరోలు మొదలుకొని నేటి కుర్ర హీరోల వరకు అందరితో అల్లు అరవింద్ సినిమాలు తీస్తున్నారు.


Click it and Unblock the Notifications











