అల్లు వారి పిల్లల ఆటలు.. ఇంట్లో సందడే సందడి!

సోషల్ మీడియాలో అల్లు పిల్లల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అయాన్, అల్లు అర్హలు చేసే అల్లరి ఒకెత్తు అయిత.. వారితో కలిసి అల్లు అర్జున్, అల్లు శిరీష్ చేసే రచ్చ మరో ఎత్తు. బన్నీ-అర్హ, బన్నీ-అయాన్‌ల క్యూట్ వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా అర్హతో చేసే పెళ్లి గోల మాత్రం నెట్టింట్లో అందర్నీ నవ్విస్తుంది. ఎన్ని సార్లు ప్రయత్నించినా.. బన్నీ ఓడిపోతూనే ఉన్నాడు.

లాక్ డౌన్ సమయంలో బన్నీ తన పిల్లలతో ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. పిల్లలతో కలిసి చేసిన అల్లరిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాడు. ఆ మధ్య ఐఫోన్ సిరితో బన్నీ, అయాన్ చేసిన అల్లరి, బుగ్గల అర్హతో బన్నీ చెప్పించే పెళ్లి సంగతులు తెగ హల్చ్ చేశాయి. బాబాయ్ శిరీష్ చిన్న చిన్న స్టెప్పులు నేర్పిస్తుంటే బుద్దిగా నేర్చుకోవడం మనమంతా చూశాం.

Allu Arha And Allu Ayaan Are Playing games

ఇక బుడ్డోళ్లు ఇంట్లో ఆడుకోవడం, బైక్ ఎక్కి షికార్లు చేయడం, వర్షం పడుతుంటే బయటకు వెళ్లడం, రెయిన్ కోట్ ధరించి ఇద్దరు చిచ్చర పిడుగులు ఫోటోలకు పోజులివ్వడం సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా బుగ్గల అర్హ టీవీలో బర్త్ డే వేడుకలను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుండగా.. అయాన్ మాత్రం రిమోట్ కార్‌తో ఆటలు ఆడకుంటున్నాడు. దాన్ని స్విమ్మింగ్ పూల్‌లో పడేసి రిమోట్‌తో ఆపరేట్ చేసుకుంటూ ఆటలు ఆడేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X