Don't Miss!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
అయాన్, అర్హల సందడి.. క్యూట్ స్టెప్పులు వైరల్
అల్లు వారి పిల్లల సందడి సోషల్ మీడియాలో ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ పిల్లలతో కలిసి చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా అర్హతో కలిసి చేసే అల్లరి, అర్హను ఏడిపించడం, బన్నీని అర్హ ఆటపట్టిండచం, వారి ముద్దు ముద్దు మాటలకు ఎంతో మంది అభిమానులున్నారు. బుగ్గల అర్హకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక అర్హ వీడియోలు, మాటలు, స్టెప్పులు, ఆమె ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
లాక్ డౌన్లో అల్లు అర్హ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. స్టార్ కిడ్స్‌లో అటు సితారా, ఇటు అర్హలకు రూటే సపరేటు. వారి ముద్దు ముద్దు మాటలు, డ్యాన్సులతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసేస్తుంటారు. వీరి అల్లరిని సోషల్ మీడియాలో ఎంజాయ్ చేసేవారు లెక్కలేనంత మంది ఉంటారు. ఆ మధ్య అల్లు శిరీష్ ఆధ్వర్యంలో బుడతలిద్దరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన సంగతి తెలిసిందే. బాబాయ్ సిరి ఆధ్వర్యంలో బాగానే డ్యాన్స్ చేయగా ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది.
తాజాగా మరోసారి అన్నాచెల్లెల్లిద్దరూ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇద్దరూ పిల్లలు చక్కగా డ్యాన్స్ చేస్తుంటే.. అల్లు స్నేహ కెమెరాతో బంధించింది. ప్రస్తుతం అల్లు అర్హ, అల్లు అయాన్ డ్యాన్స వీడియో బాగానే వైరల్ అవుతోంది. తాజాగా అల్లు అర్జున్, అల్లు స్నేహాలు జాగింగ్‌కు వెళ్లిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో అల్లు అర్జున్ లుక్ అందరూ ఫిదా అవుతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' కోసం సన్నద్దమవుతున్నాడు. దీనికోసం హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ సెట్ వేయబోతోన్నట్టు తెలుస్తోంది.