అల్లు అర్హ బర్త్ డే.. మైత్రీ మూవీస్ స్పెషల్ సర్ ప్రైజ్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ మధ్య ఎలాంటి ముద్దు ముద్దు చర్చలు జరుగుతుంటాయో అందరికీ తెలిసిందే. పెళ్లి విషయంలో తన దారిలోకి తెచ్చుకునేందుకు ఇప్పటినుంచి కూతురితో పోట్లాడుతూ ఉన్నాడు. కానీ అర్హ మాత్రం ససేమిరా అంటోంది. బన్నీ అర్హలు చేసే అల్లరి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అర్హ నాలుగో పుట్టినరోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.
ప్రతీసారి ఇంట్లోఘనంగా నిర్వహించే బర్త్ డే వేడుకలు.. ఈ సారి పుష్ప సెట్‌లో జరిపించారు. మారేడుమిల్లి లాంటి అటవీ ప్రాంతంలో అల్లు అర్హ నాలుగో పుట్టినరోజు వేడుకలు నవంబర్ 21న రాత్రి వేళలో ఘనంగా జరిగాయి. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అక్కడే రిసార్ట్స్ అద్దెకు తీసుకుని అల్లు అర్జున్ సహా చిత్ర యూనిట్‌ను ఉంచింది. ఆ రిసార్ట్స్‌లోనే అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలను జరిపారు.

అయితే అర్హ బర్త్ డే అంత ఘనంగా నిర్వహించడంతో బన్నీ ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా మైత్రీ మూవీస్ నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాడు. అర్హ పుట్టినరోజు సందర్భంగా మాకు గుర్తుండిపోయే ఆతిథ్యం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవి గారు, నవీన్ గారు, చెర్రీ గారికి కృతజ్ఞతలు. ఆతిథ్యం అదిరిపోయింది మరోసారి మీకు ధన్యవాదాలు అని బన్నీ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











