వైరల్ వీడియో : బుట్టబొమ్మ పాటను పాడిన అల్లు అర్హ

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ మాయాజాలంతో అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా తమన్ అందించిన పాటలు సినిమా విడుదలకు ముందే.. ఓ ట్రెండ్ సెట్ చేశాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా.. దేశం మొత్తం ఓ ఊపే ఊపేశాయి. ఒక్కో పాట.. కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.

కేవలం పాటలతోనే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ ఇలా ఒక్కో పాటు యూట్యూబ్‌లో సంచలనాన్ని సృష్టించింది. మిలియన్ల మీద మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి.. తెలుగు సినీ చరిత్రలో వంద మిలియన్ల వ్యూస్ సాధించిన పాటలుగా రికార్డులు నమోదు చేశాయి. పాటలే ఇలా ఉండగా.. వీడియో సాంగ్స్ ఇంకో రేంజ్‌లో చిత్రీకరించారు.

View this post on Instagram

Our lil #buttabomma singing #buttabomma #quarantinefun

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

Allu Arha Sings Butt Bomma Song

ముఖ్యంగా బుట్టబొమ్మ స్టెప్పులకు దేశం మొత్తం ఫిదా అయింది. బుట్టబొమ్మ ఫీవర్ ఖండాలు ధాటి పోయింది. ఈ మధ్య క్రికెటర్ తన భార్యతో కలిసి చేసిన బుట్టబొమ్మ టిక్ టాక్ వీడియో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ విదేశీ వనిత.. బుట్టబొమ్మ సాంగ్‌ను ఎంతో అందంగా పాడింది. అదే మాదిరిగా అల్లు అర్హ క్యూట్‌గా బుట్టబొమ్మ పాటను ఆలపించింది. ఇక దీనికి సంబంధించి వీడియో ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తోంది. అల్లు స్నేహ తన సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X