twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : వామ్మో బన్నీతోనే పోటీ.. అకీరా నందన్ క్రేజ్ మామూలుగా లేదే!

    |

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ వేరు.. పవన్ కళ్యాణ్ తనయుడిగా అకీరా నందన్ క్రేజ్ వేరు. అయినా సరే వీరిద్దరు ఓ విషయంలో పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. వీరిద్దరు అంటే ప్రత్యక్షంగా కాదు లేండి.. ఇరువురు అభిమానులన్న మాట. ఇంకా ఒక్క సినిమా కూడా చేయని అకీరాకు అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారనే పిచ్చి ప్రశ్నను మాత్రం వేయకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో అకీరాకు ఉండే క్రేజే వేరు. అలాంటి వీరి పుట్టిన రోజు అనేది నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అవుతోంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

    అక్కడక్కడా కనిపిస్తేనే..

    అక్కడక్కడా కనిపిస్తేనే..

    పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ అక్కడక్కడా కనిపిస్తేనే ఈ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. అలాంటిది పూర్తిగా వెండితెరపై కనిపిస్తే ఇంకేమైనా ఉంటుందా. ఆ మధ్య మెగా ఫ్యామిలీ ఇంట జరిగిన సంబరాల్లో తళుక్కున మెరిశాడు అకీరా. అకీరా పుట్టిన రోజు (ఏప్రిల్ 8) సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.

    ట్విట్టర్ వార్..

    ట్విట్టర్ వార్..

    సోషల్ మీడియాలో అల్లు అర్జున్, అకీరా నందన్‌పై పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్ విషెస్, ట్వీట్స్‌కు దెబ్బకు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. దేశంలో ప్రస్తుతం ఎన్ని సమస్యలున్నా.. వీరిద్దరి బర్త్ డేలు ట్రెండింగ్ అవ్వడం హాట్ టాపిక్‌గా మారాయి.

    అల్లు అర్జున్ మొదటి స్థానంలో..

    అల్లు అర్జున్ మొదటి స్థానంలో..

    అయితే ఈ మేరకు బన్నీ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకు దెబ్బకు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. #HappyBirthdayAlluArjun అనే హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అవ్వగా.. #HBDAkiraNandan నాల్గో స్థానంలో ఉంది. ఈ లెక్కన అకీరా నందన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    Recommended Video

    Buttabomma Video Song Crossed 100 Million Views | Viral In TikTok As well
    రేపు మెగా ట్రీట్స్..

    రేపు మెగా ట్రీట్స్..

    ఏప్రిల్ 8న తనకెంతో ఇష్టమైన తారీఖు.. ఎంతో అనుబంధం ఉందని చిరంజీవి చేసిన ట్వీట్స్ మెగా అభిమానుల్లో ఎంతో ఉత్కంఠను రేపింది. మరోవైపు రేపు బన్నీ-సుకుమార్ ప్రాజెక్ట్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రాబోతోంది. ఇలా మెగా ఫ్యాన్స్ రేపు ట్రీట్స్‌తో ఫుల్ మీల్స్ దొరుకుతుందన్న మాట.

    English summary
    Allu Arjun ANd Akira Nandan Birthday Issue Trending At Twitter. Both HappyBirthdayAlluArjun And HBDAkiraNandan Hashtags Goes Viral And Trending National Wide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X