Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఇప్పటికి 374 సార్లు ప్రయత్నించాడట.. అల్లు అర్హ సమాధానం మాత్రం ఒక్కటే.. బన్నీ పరువుతీసేట్టుగా ఉంది!!
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యం ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీకి ఆయన పిల్లలిద్దరే లోకం. ఈ విషయాన్ని బన్నీయే స్వయంగా ఎన్నో సార్లు చెప్పాడు. ఖాళీ సమయం దొరికితే చాలు పిల్లలిద్దరితో సరదాగా సమయాన్ని గడిపేస్తుంటాడు. ముఖ్యంగా అర్హతో కలిసి బన్నీ చేసే అల్లరి అంటే అందరికీ ఇష్టమే. వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో లెక్కలేనన్ని క్యూట్ వీడియోలున్నాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన సంభాషణ అందర్నీ ఆకట్టుకుంది.
క్యూట్ వీడియోలు..
బన్నీ, అల్లు అర్హ, అల్లు అయాన్లకు సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియలో వైరల్ అవుతుంటాయి. వీరు చేసే అల్లరిని అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య పెళ్లిపై తండ్రీ కూతుళ్లు ముచ్చటించుకున్న వీడియోను కూడా షేర్ చేసింది.
అన్నింటికి ఓకే కానీ..
బన్నీ చెప్పినట్టుగానే అన్నింటిని చిలక పలుకుల్లా వల్లెవేసింది అల్లు అర్హ. అయితే ఒక్క పెళ్లి విషయంలో మాత్రం బన్నీ చెప్పిన దానికి విరుద్దంగా తల ఊపుతూ వ్యతిరేకించింది. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అని బన్నీ ప్రశ్నించడం.. చేసుకోనని అల్లు అర్హ సమాధానం ఇవ్వడం అందర్నీ నవ్వించింది.
సెటైర్ వేసిన సతీమణి..
అయితే అల్లు అర్హ తన మాటలను వ్యతిరేకించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నేను చెప్పిన వాడిని చేసుకోదంటా అని కామెంట్ చేశాడు. అయితే బన్నీ సతీమణి స్నేహా రెడ్డి స్పందిస్తూ.. నువ్ మాత్రం మీ నాన్న చెప్పిన అమ్మాయిని చేసుకున్నావా? అంటూ కౌంటర్ వేసింది.
Recommended Video
|
ఇప్పటికి 374 సార్లు ప్రయత్నించాడట..
తాజాగా బన్నీ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో.. వరాలు, బుజ్జులు, బంగారం.. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అని బన్నీ ఎంతో గారాభంగా అడిగాడు. కానీ బుగ్గల అర్హ మాత్రం.. చేసుకోను అని క్యూట్‌గా చెప్పి పారిపోయింది. ఇది ఇప్పటికి 374వ అటెంప్ట్ అని.. అయినా అదే సమాధానం చెబుతోందని బన్నీ వాపోతున్నాడు. దీంతో భవిష్యత్తులో బన్నీ పరువు తీస్తుందేమోనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.