Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
డైరెక్టర్ మారుతి బర్త్ డే.. బన్నీ, సాయి ధరమ్ తేజ్ స్పెషల్ విషెస్
ఈ రోజుల్లో, బస్ స్టాప్ అంటూ యూత్ అండ్ అడల్డ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాడు డైరెక్టర్ మారుతి. అయితే ఆపై ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ హెల్దీ కామెడీలతో అందరి మనసులను దోచుకున్నాడు. భలె భలె మగాడివోయ్ చిత్రంతో మారుతి శైలిలో భారీ మార్పులు వచ్చాయి. చివరగా ప్రతిరోజూ పండగే అంటూ మంచి మూవీతో మారుతి ప్రేక్షకులను పలకరించాడు.
దర్శకుడు మారుతి పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 8). ఈ క్రమంలో టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక విషెస్ అందించాడు. మామూలుగా మారుతి మెగా, అల్లు కాంపౌండ్‌కు వీరాభిమాని. ఈ సందర్భంగా బన్నీ చెప్పిన విషెస్ వైరల్ అవుతున్నాయి. నాకున్న మంచి స్నేహితుల్లో మారుతి ఒకరు అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు. ఇక బన్నీ ట్వీట్ చూసిన మారుతి గాల్లో తేలిపోయాడు. థ్యాంక్యూ బన్నీ బాబు అంటూ మారుతి రిప్లై ఇచ్చాడు.
నా డార్లింగ్ మారుతి అన్నకు హ్యాపీ బర్త్ డే. నువ్ చేసిన ఎన్నో వాటికి థ్యాంక్స్ అన్న. నాకు ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో నా వెన్నంటే ఉన్నందుకు థ్యాంక్స్ అన్న.. అలాంటి సమయంలో కూడా నువ్ నన్ను నవ్వించావ్ అన్న.. అదెప్పుడూ మరిచిపోలేను. లవ్యూ అన్నా అంటూ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ ట్వీట్‌కు మారుతి స్పందిస్తూ.. థ్యాంక్యూ డార్లింగ్ బ్రదర్ తేజు.. నీకు మంచి భవిష్యత్ ఉంది. నీతో పని చేయడం ఎంతో బాగుందని అన్నాడు.