Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వైరల్ పిక్ : ‘పుష్ప’రాజ్ కదిలాడు.. అందుకే స్టైలీష్ స్టార్ అయ్యాడు!!
పాత్రలో పరకాయ ప్రవేశం చేసే హీరోలు, ఆర్టిస్ట్‌లు అతి కొద్ది మందే ఉంటారు. పాత్రకు తగ్గట్టు వేషధారణ, భాష, ప్రాస,యాస ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకతను కొంత మంది హీరోలే చూపిస్తారు. అందులో నేటి తరం హీరోల్లో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. చేసే ప్రతీ సినిమాలో వేరియేషన్స్ చూపిస్తుంటాడు. ప్రతీ సినిమాకు మాడ్యులేషన్ మారుస్తుంటాడు. తాజాగా పుష్ప సినిమా కోసం బన్నీ మారిన తీరు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
పుష్ప ఫస్ట్ లుక్‌తో ఫిదా...
అల వైకుంఠపురములో సినిమాలో కాస్త డీగ్లామర్‌గా కనిపించిన బన్నీ.. పుష్ప సినిమా కోసం మరింతగా తగ్గాడు. మొత్తానికి రా లుక్‌లోకి మారిపోయాడు. మాసిన గడ్డం, చెదిరిన జుట్టు, దుమ్ముతో ఉన్న బట్టలు ఇలా అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రను ఓ రేంజ్లో పెట్టబోతోన్నాడని ఫస్ట్ లుక్‌తోనే అర్థమైంది.
చాలాగ్యాప్..
కరోనా, లాక్డౌన్ మూలానా పుష్ప సినిమా షూటింగ్‌కు చాలా గ్యాప్ వచ్చింది. ఆగస్ట్లొనే అన్ లాక్ ప్రక్రియ మొదలైన దాదాపు రెండు నెలలు ఎదురుచూశారు. మొత్తానికి పుష్పను లైన్లో పెట్టేశారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రారంభించాడు.
మారెడుమిల్లి అడవుల్లో..
పుష్ప సినిమా ఎర్ర చందన స్మిగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దట్టమైన అటవీ ప్రాంతాలున్న ప్రదేశాల్లో పుష్ప షూటింగ్ చేయాలని భావించారు. అందుకే మొదటగా కేరళ అడవులను ఎంచుకున్నారు. ఇప్పుడున్నపరిస్థితుల్లో వేరే రాష్ట్రాలు,దేశాలకు వెళ్లడం అంత మంచిది కాదని ఏపీలోని మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్‌ను ప్రారంభించారు.
తాజాగా లుక్..
నవంబర్ 10 పుష్ప సెట్స్ పైకి వచ్చింది. బన్నీపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తాజాగా మైత్రీ మూవీస్ పుష్పరాజ్‌ను అందరికీ మరోసారి పరిచయం చేసింది. పుష్ప రాజ్ అలా అడవిలో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. వెనుక నుంచి బన్నీ మాస్ లుక్‌ను మరోసారి షేర్ చేశారు. యో.. పుష్పరాజ్ ఒచ్చేసినాడు.. అంటూ ప్రత్యేకమైన యాసలో తెలిపారు. మొత్తానికి ఈ పోస్టర్ ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. పాత్ర కోసం అంతలా తపన పడుతాడు కాబట్టే బన్నీ స్టైలీష్ స్టార్ అయ్యాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.