ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్.. కొడుకు అకీరాను గుర్తు చేసుకున్న పవర్ స్టార్!

Recommended Video

Allu Arjun Attended Pawan Kalyan's Janasena Party Meeting || Filmibeat Telugu

మెగా ఫ్యామిలీ స్టార్స్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగబాబు ఒకే వేదికపై కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. జనసేన పార్టీ తరుపున ప్రచారం నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా అల్లు అర్జున్ మంగళవారం పాలకొల్లు ఎన్నికల సభలో పాల్గొన్నారు.

పవర్ స్టార్ ఆవేశంగా అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ తమకు పవర్ అప్పగిస్తే చేయబోయే మంచి పనులు గురించి వివరిస్తుండగా... పక్కనే చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డారు స్టైలిష్ స్టార్. పాలకొల్లు అల్లు అర్జున్ స్వస్థలం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.

పాలకొల్లు సభలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్

పాలకొల్లు సభలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్

పాలకొల్లులో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ పక్కనే ఉండి అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ ఏమైనా ప్రసంగిస్తారు అనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగం అనంతరం వెళ్లిపోవడంతో ఆయనతో పాటు అల్లు అర్జున్ కూడా స్టేజీ దిగిపోయారు.

పుట్టినరోజున అకీరాకు ఫోన్ కూడా చేయలేకపోయాను

పుట్టినరోజున అకీరాకు ఫోన్ కూడా చేయలేకపోయాను

నేను నా బిడ్డల స్వార్థం చూసుకుంటే మామూలు తండ్రిని, అందరి బిడ్డల భవిష్యత్ బావుండాలనే జనసేన పార్టీ స్థాపించాను. నిన్న నా కొడుకు పుట్టినరోజు... ఫోన్ కూడా చేయలేక పోయాను అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

గబ్బర్ సింగ్ సినిమా చూశారుగా...

గబ్బర్ సింగ్ సినిమా చూశారుగా...

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ‘గబ్బర్ సింగ్' సినిమా ప్రస్తావన తెచ్చారు. మీకు గాజు గ్లాసు గుర్తు లేక పోతే ‘గబ్బర్ సింగ్' సినిమాలో టీ గ్లాసు గుర్తు పెట్టుకోండి అంటూ చమక్కులు విసిరారు. పవన్ కళ్యాణ్ నుంచి ఈ మాట రాగానే అభిమానులు విజిల్స్ వేస్తూ కేరింతలు కొట్టారు.

‘ఐకాన్' క్యాప్‌తో అల్లు అర్జున్‌.. ఘన స్వాగతం

‘ఐకాన్' క్యాప్‌తో అల్లు అర్జున్‌.. ఘన స్వాగతం

పాలకొల్లు జనసేన సభలో పాల్గొనడానికి వచ్చిన అల్లు అర్జున్‌కు రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బన్నీ ‘ఐకాన్' అని రాసి ఉన్న క్యాప్ ధరించడం అందరినీ ఆకట్టుకుంది. త్వరలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే చిత్రానికి ‘ఐకాన్' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

తిరిగి హైదరాబాద్ తిరుగు ప్రయాణం

తిరిగి హైదరాబాద్ తిరుగు ప్రయాణం

ఎన్నికల ప్రచారానికి నేడు(ఏప్రిల్ 9) సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది. ఏప్రిల్ 24 నుంచి అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X