HBD Allu Arjun: బన్నీకి అన్ని వందల కోట్ల ఆస్తులు.. చిన్నప్పుడే రికార్డు.. ఎవరికీ తెలియని నిజాలు ఇవే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. ఆరంభంలోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ 'పుష్ప' మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా అతడి గురించి కొన్ని విషయాలు మీకోసం!

చిన్నప్పుడే బన్నీ రికార్డు: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిన్న వయసులోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'విజేత' అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగాపరిచయం అయ్యాడు. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన 'స్వాతి ముత్యం' చిత్రంలోనూ చేశాడు. ఇలా చిన్నప్పుడే రెండు భారీ హిట్లలో భాగం అయ్యాడు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన 'డాడీ'లో అత్యంత ముఖ్యమైన రోల్‌ను చేశాడు.
అలా వచ్చి.. స్టైలిష్ స్టార్: అల్లు అర్జున్.. రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'గంగోత్రి'తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ వెంటనే సుకుమార్ చేసిన 'ఆర్య'తో స్టైలిష్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు.

హిట్లు ఫ్లాపులతో సమానం: హీరోగా అల్లు అర్జున్ హిట్లతో హ్యాట్రిక్ నమోదు చేసుకున్నాడు. తర్వాత కొన్ని ఫ్లాపులు వచ్చినా.. 'దేశముదురు'తో భారీ హిట్ కొట్టాడు. 'జులాయి', 'రేసుగుర్రం', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సరైనోడు', 'అల.. వైకుంఠపురములో' వంటి హిట్లు కొట్టాడు. అలాగే, 'వరుడు', 'బద్రీనాథ్', 'హ్యాపీ', 'ఇద్దరమ్మాయిలతో', 'నా పేరు సూర్య' వంటి ఫ్లాపులు చవిచూశాడు.
లవ్ మ్యారేజ్.. ఎంజాయ్: టాలీవుడ్‌లో స్టార్ హీరోగా సత్తా చాటుతోన్న అల్లు అర్జున్.. స్నేహారెడ్డితో ప్రేమాయణం సాగించాడు. ఈ క్రమంలోనే 2011లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక, ఈ జంటకు అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. షూటింగ్ లేని సమయాల్లో బన్నీ ఎక్కువగా కుటుంబంతోనే సమయాన్ని గడుపుతాడు. ఇందులో భాగంగానే హాలీడే ట్రిప్‌లతోనూ యమ ఎంజాయ్ చేస్తున్నాడు.

పాన్ ఇండియా స్టార్‌గా: రెండేళ్ల క్రితమే అల్లు అర్జున్ 'పుష్ప' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. అంతేకాదు, రిలీజైన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా బన్నీని ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్‌ను చేసింది. ఇక, ఇప్పుడు దీని సీక్వెల్ 'పుష్ప ది రూల్'తో బన్నీ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.
బన్నీకి అన్ని కోట్ల ఆస్తి: అల్లు అర్జున్ పేరిట ప్రస్తుతం రూ. 400 కోట్లు నికర విలువ ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, ఈ స్టార్ హీరోకు హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో రూ. 150 కోట్ల విలువ చేసే ఇళ్లు ఉన్నాయట. అలాగే, దాదాపు రూ. 20 కోట్లు విలువైన కార్లు, రూ. 10 కోట్ల విలువైన యాక్ససిరీస్‌లు, రూ. 200 కోట్లు విలువైన ఫ్లాట్లు ఉన్నాయని తెలిసింది. అలాగే, 200 కోట్ల బిజినెస్ కూడా ఉందని టాక్.

రెమ్యూనరేషన్ సెంచరీ: కెరీర్ ఆరంభంలో తక్కువ మొత్తాన్నే రెమ్యూనరేషన్‌గా తీసుకున్న అల్లు అర్జున్.. నిన్న మొన్నటి వరకూ రూ. 50 - 60 కోట్లు చార్జ్ చేసేవాడు. కానీ, 'పుష్ప' తర్వాత దాన్ని రూ. 100 కోట్లకు పెంచాడని తెలిసింది. ఇక, ఇప్పుడు 'పుష్ప ది రూల్'తో పాటు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే చిత్రానికి రూ. 100 - 120 కోట్లు బన్నీ చార్జ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.
సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. ఇప్పుడు 'పుష్ఫ'గా పాన్ ఇండియాపై దండయాత్ర చేస్తూ తగ్గేదేలే అంటోన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











