HBD Allu Arjun: విజేత నుంచి ఐకాన్ స్టార్‌గా.. బన్నీ ఆస్తి అన్ని వందల కోట్లా.. ఏకైక హీరోగా రికార్డు

బడా నిర్మాత కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలోనే నటన, డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్స్‌తో పాటు స్పెషల్ స్టైల్స్‌తో మెప్పించి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు అల్లు అర్జున్. దీనికితోడు ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని తన రేంజ్‌ను పెంచుకున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బన్నీ ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. దీంతో మరింత ఉత్సాహంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అతడి రెమ్యూనరేషన్, ఆస్తులు, రికార్డుల గురించి కొన్ని విషయాలు మీకోసం!

చైల్డ్ ఆర్టిస్టుగా సెన్సేషన్:అల్లు అర్జున్ చాలా చిన్నగా ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'విజేత' అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన 'స్వాతి ముత్యం' చిత్రంలోనూ నటించాడు. ఇలా చిన్న వయసులోనే రెండు భారీ హిట్లను కొట్టి సెన్సేషన్ అయ్యాడు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి 'డాడీ' మూవీలో కీలక పాత్రలో మెరిశాడు.

Allu Arjun Birthday Icon Star Allu Arjun Net Worth and Remuneration Details

స్టైలిష్ స్టార్‌గా మారాడు:రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'గంగోత్రి'తో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ వెంటనే సుకుమార్ చేసిన 'ఆర్య'తో స్టైలిష్ స్టార్ అనే బిరుదును అందుకున్నాడు. ఆ తర్వాత సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ వచ్చాడు. ఇలా ఎన్నో హిట్లు కొట్టి తద్వారా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు.

సమాంతరంగానే కెరీర్:సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో అల్లు అర్జున్ ఎన్నో మూవీలు చేశాడు. అందులో 'గంగోత్రి', 'ఆర్య', 'దేశముదురు', 'జులాయి', 'రేసుగుర్రం', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సరైనోడు', 'అల.. వైకుంఠపురములో' వంటి హిట్లు కొట్టాడు. అలాగే, 'వరుడు', 'బద్రీనాథ్', 'హ్యాపీ', 'ఇద్దరమ్మాయిలతో', 'నా పేరు సూర్య' వంటి డిజాస్టర్లను కూడా చవి చూశాడు.

Allu Arjun Birthday Icon Star Allu Arjun Net Worth and Remuneration Details

ప్రేమ పెళ్లితో సంతోషం:స్టార్ హీరోగా సత్తా చాటుతోన్న అల్లు అర్జున్.. ఆ మధ్యన స్నేహారెడ్డితో ప్రేమాయణం సాగించాడు. ఈ క్రమంలోనే 2011లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక, ఈ జంటకు అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. షూటింగ్ లేని సమయాల్లో బన్నీ ఎక్కువగా కుటుంబంతోనే సమయాన్ని గడుపుతాడు. తద్వారా టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు.

ఐకాన్ స్టార్.. రికార్డుతో:అల్లు అర్జున్ 'పుష్ప' అనే సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గానూ అతడు నేషనల్ అవార్డును కూడా అందుకున్నాడు. తద్వారా ఇది సాధించిన మొదటి తెలుగు హీరోగా నిలిచాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు బన్నీ 'పుష్ప ది రూల్'లో నటిస్తున్నాడు. అలాగే, త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలతో మూవీలను అనౌన్స్ చేశాడు.

Allu Arjun Birthday Icon Star Allu Arjun Net Worth and Remuneration Details

అల్లు అర్జున్ ఆస్తులు:అల్లు అర్జున్‌ పేరిట ప్రస్తుతం రూ. 460 కోట్లు ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, ఈ స్టార్ హీరోకు హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో రూ. 150 కోట్ల విలువ చేసే ఇళ్లు ఉన్నాయట. అలాగే, దాదాపు రూ. 20 కోట్లు విలువైన కార్లు, రూ. 10 కోట్ల విలువైన యాక్ససిరీస్‌లు, రూ. 200 కోట్లు విలువైన ఫ్లాట్లు ఉన్నాయని తెలిసింది. అలాగే, 200 కోట్ల బిజినెస్ కూడా ఉందని సమాచారం.

రెమ్యూనరేషన్ ఫుల్‌గా:ఆరంభంలో హీరోగా చాలా తక్కువ రెమ్యూనరేషన్‌గా తీసుకున్న అల్లు అర్జున్.. నిన్న మొన్నటి వరకూ రూ. 50 - 60 కోట్లు చార్జ్ చేసేవాడు. కానీ, 'పుష్ప' తర్వాత దాన్ని రూ. 100 కోట్లకు పెంచాడని తెలిసింది. ఇక, ఇప్పుడు 'పుష్ప ది రూల్'‌తో పాటు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా చిత్రాలకు కూడా రూ. 100 - 120 కోట్లు బన్నీ చార్జ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. ఇప్పుడు 'పుష్ఫ'గా పాన్ ఇండియాపై దండయాత్ర చేస్తూ తగ్గేదేలే అంటోన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X