గంగోత్రి, డాడీ కంటే ముందు బన్నీ ఎన్ని సినిమాలు చేశాడో తెలుసా.. క్యూట్ ఫొటోస్ వైరల్!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి అని అందరికి తెలిసిన విషయమే. అయితే అంతకుముందు డాడీ అనే సినిమా కూడా చేసినట్లు దాదాపు అభిమానులందరికి తెలుసు. ఇక ఎక్కువ మందికి తెలియని విషయాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన చిన్నప్పటి ఫొటోలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Celebrities Green India Challenge
 విమర్శకుల నోళ్లు మూయించేలా..

విమర్శకుల నోళ్లు మూయించేలా..

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అనే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా అతి తక్కువ కాలంలోనే అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా చూసి అసలు ఇతను హీరో ఏంటి అన్నవాళ్ల నోరు మూయించేలా తన స్థాయిని పెంచుకున్నాడు. బన్నీ డ్యాన్స్ స్కిల్స్ కి ఎలాంటి హీరోలైనా షాక్ అవ్వాల్సిందే. అంతలా కష్టపడి ఇండియన్ సినిమా హీరోల్లోనే బెస్ట్ డ్యాన్సర్ గా క్రేజ్ అందుకున్నాడు.

అంతకు ముందు రెండు సినిమాల్లో

అంతకు ముందు రెండు సినిమాల్లో

ఇక బన్నీ మొదట కె.రాఘవేంద్రరావు రావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడనికి ముందు డాడీ సినిమాలో ఒక చిన్న డ్యాన్సర్ గా కనిపించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు రెండు సినిమాల్లో బన్నీ బాల నటుడిగా కనిపించాడు.

ఆ సినిమాలో మెగాస్టార్ కి మేనల్లుడిగా..

ఆ సినిమాలో మెగాస్టార్ కి మేనల్లుడిగా..

అందులో స్వాతిముత్యం కూడా ఉంది. ఇక అన్నిటికంటే ముందు వెండితెరపై కనిపించింది మాత్రం విజేత సినిమా ద్వారానే. 1985లో వచ్చిన ఆ సినిమాలో మెగాస్టార్ మేనల్లుడిగా కనిపించాడు. ఇక ఆ తరువాత 1986లో కమల్ హసన్, కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో కూడా బన్నీ స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చాడు.

కమల్ హాసన్ మనవడిగా

కమల్ హాసన్ మనవడిగా

స్వాతిముత్యంలో కమల్ హాసన్ మనవళ్లలో ఒకడిగా ఒక చిన్న షాట్ లో కనిపించాడు. ఆ విధంగా బన్నీ నేటితరం యువ హీరోల కంటే ముందే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక గంగోత్రి కమర్షియల్ గా కొంత సక్సెస్ అయినప్పటికీ బన్నీ నటనపై కొన్ని సెటైర్స్ వచ్చాయి. కానీ సెటైర్స్ కౌంటర్ ఇచ్చేలా ఆ తరువాత బన్నీ చేసిన సినిమాలు ఇండస్ట్రీలో అతనికి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.

150కోట్లకు పైగా షేర్స్..

150కోట్లకు పైగా షేర్స్..

ఇటీవల వచ్చిన అల..వైకుంఠపురములో సినిమాతో 150కోట్లకు పైగా షేర్స్ అందించిన హీరోగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X