హాట్ టాపిక్ : అఖిల్‌కు చెప్పాడు అకీరాను పట్టించుకోలేదు.. బన్నీ చర్యలు ఊహాతీతమేనా?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పే మాటలు, చేసే చేష్టలు ఒక్కోసారి ఎవ్వరికీ అంతు పట్టవు. ఒక్కోసారి తనకు మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టమన్నట్టు మాట్లాడతాడ.. మరోసారి వేరే కుంపటి పెట్టినట్టు హింట్ ఇస్తూ మాట్లాడతాడు. తాను మెగా హీరోను కాదని పరోక్షంగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాడు. అల్లు వారి హీరోగా, అల్లు బ్రాండ్ వ్యాల్యూకే ప్రాధాన్యమిస్తున్నట్టు చేస్తాడు. తాజాగా బన్నీ చేసిన ఓ పని అందరిలోనూ ఉన్న అనుమానాలను మరోసారి రేకెత్తించింది. అదేంటో ఓ సారి చూద్దాం.
Recommended Video

చెప్పను బ్రదర్ ఎపిసోడ్..
చెప్పను బ్రదర్ అనే ఎపిసోడ్ మెగా అభిమానులందరికీ గుర్తుండే ఉంటుంది. ఓ ఆడియో ఫంక్షన్‌లో పవర్ స్టార్ అనే నానా హంగామా చేసిన ఫ్యాన్స్.. బన్నీని సైతం ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. పవర్ స్టార్ అని అనాలంటూ డిమాండ్ చేశారు. అయితే చిర్రెత్తిపోయిన బన్నీ.. చెప్పను బ్రదర్ అంటూ కొత్త వివాదానికి తెరతీశాడు.

మధ్యలో కలుసుకున్నా..
అయితే ఈ ఒక్క ఎపిసోడ్‌తో మెగా హీరోల మధ్య చిన్న అంతరం ఏర్పడినట్టు కనిపించింది. మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్‌పై ఫైర్ అయ్యారు. తన సినిమాలపై పవన్ ఫ్యాన్స్ కక్షగట్టారు. పనిగట్టుకుని బన్నీని టార్గెట్ చేశారు. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కలుసుకున్నా కూడా అంతరం మాత్రం అలాగే ఉండిపోయింది.

మెగా ఊసులేకుండానే..
అంతకుముందు వేదికలు ఎక్కితే మెగా జపం చేసే బన్నీ.. గత కొన్ని రోజులుగా మెగా ఊసే ఎత్తడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, సక్సెస్ వేడుకలు అయినా అల్లు ఫ్యామిలీ గురించే చెప్పుకుంటున్నాడు. తన హద్దులను చెరిపేసుకుని, తాను మెగా కాంపౌండ్‌కు చెందినవాడిని కాదని చాటి చెప్పడానికే ఇలా చేస్తున్నాడని కామెంట్స్ వినిపించాయి.

అకీరాను విష్ చేయని బన్నీ..
ఏప్రిల్ 8న అల్లు అర్జున్, అఖిల్ అక్కినేని, అకీరా నందన్ పుట్టినరోజులు. వీటిలో బన్నీ బర్త్ డే నిన్నంతా హల్చల్ అయింది. వెల్లువెత్తిన విషెస్‌కు పేరు పేరునా రిప్లై ఇస్తూ ధన్యవాదాలు చెప్పసాగాడు. అయితే అఖిల్‌కు విషెస్ చెప్పిన బన్నీ.. అకీరాను మాత్రం విష్ చేయలేదు. అకీరా బర్త్ డే సందర్బంగా చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ వంటి వారు విష్ చేయగా బన్నీ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు.

బన్నీ చర్యలు ఊహాతీతం..
అయితే బన్నీ కావాలనే అకీరాకు విషెస్ తెలపలేదని ఒక వర్గం వాదన. అఖిల్‌కు కూడా విషెస్ చెప్పకపోతే ఈ వాదన తెర మీదకు వచ్చేది కాదని, అతనికి చెప్పి అకీరాను పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బన్నీ చర్యలు అర్థం చేసుకోవడం కష్టమే. మరి వీటికి బన్నీ ఏదైనా సమాధానం ఇస్తాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











