twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: RR సెంటిమెంట్‌ను నమ్ముకున్న అల్లు అర్జున్.. ఆ లెక్కన చూస్తే ఇది కూడా హిట్టే.!

    By Manoj Kumar P
    |

    మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోనే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఒకేలా వెళ్తున్న ఇండస్ట్రీకి సరికొత్త స్టైల్స్‌ను పరిచయం చేసిన ఈయన.. యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. ఒక్క స్టైల్‌లోనే కాదు.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలో రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. హిట్ వచ్చినప్పుడు పొంగిపోకుండా.. ఫ్లాప్‌లు వస్తే క్రుంగిపోకుండా ఉండడం అతడి నైజం. అందుకే బన్నీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతున్నాడు. తాజాగా సినిమా టైటిల్ విషయంలో అతడు చేసిన ఓ పని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

    రెండు హిట్ల తర్వాత మళ్లీ కలిశారు

    రెండు హిట్ల తర్వాత మళ్లీ కలిశారు

    ‘నా పేరు సూర్య' తర్వాత గ్యాప్ ఇచ్చాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అతడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తున్నాడు. ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్‌ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. నవదీప్, సుశాంత్, టబు, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

    వాటికి ఏమాత్రం తీసిపోకుండా

    వాటికి ఏమాత్రం తీసిపోకుండా

    త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మాటల మాంత్రికుడు అనే పేరుంది. అంతలా ఆయన డైలాగులు పేలుతుంటాయి. వీటికితోడు బలమైన కుటుంబ విలువలతో కూడిన కథలను రాస్తారు. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇదే జోనర్‌లో వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేస్తున్న సినిమా కూడా వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

    అవన్నీ అంచనాలను పెంచేశాయి

    అవన్నీ అంచనాలను పెంచేశాయి

    ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ను షురూ చేసేసింది. ఇప్పటికే దీని నుంచి వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులోని రెండు పాటలు తెలుగు సినిమా రికార్డులను క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ రెట్టింపు అయిపోయాయి.

    RR సెంటిమెంట్‌ను నమ్ముకున్న అల్లు అర్జున్

    RR సెంటిమెంట్‌ను నమ్ముకున్న అల్లు అర్జున్

    ‘అల.. వైకుంఠపురములో' విషయంలో బన్నీ నమ్ముకున్న ఓ సెంటిమెంట్ తాజాగా తెరపైకి వచ్చింది. ఈ సినిమా టైటిల్‌లో ఉన్న ఆ సెంటిమెంట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ మూవీ ఇంగ్లీష్ టైటిల్‌లో మొదట ఒక R మాత్రమే ఉండాల్సి ఉన్నా.. దానికి అదనంగా మరొకటి జోడించి ‘Ala Vaikunthapurramloo'గా ఫిక్స్ చేశారు.

    ఆ లెక్కన చూస్తే ఇది కూడా హిట్టే.!

    ఆ లెక్కన చూస్తే ఇది కూడా హిట్టే.!

    ఈ సినిమా టైటిల్ విషయంలో బన్నీ తీసుకున్న నిర్ణయం వెనుక బలమైన కారణం ఉంది. గతంలో అతడు నటించిన Sarrainodu, Race Gurram టైటిళ్లలోనూ రెండు RRలు ఉంటాయి. ఈ రెండు సినిమాలూ భారీ విజయాలను అందుకున్నాయి. దీనికితోడు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేశాయి. ఈ లెక్కన చూస్తే వైకుంఠపురములో కూడా హిట్ అవుతుందని అంటున్నారు.

    English summary
    Ala Vaikunthapurramuloo is an upcoming Indian Telugu-language action drama film directed by Trivikram Srinivas and produced by Allu Aravind and S. Radha Krishna under their banners Geetha Arts and Haarika & Hassine Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X