twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాష్ బ్యాక్ : ‘భద్ర’కు పదిహేనేళ్లు.. బన్నీ కలిపిన బంధం.. అసలు విషయమేంటంటే?

    |

    ఓ సినిమా కథ గమ్యం ఎక్కడకు వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేదు. ఓ హీరోకు రాసిన కథ.. మరో హీరో చేతికి వెళ్తుంది. సినీ పరిశ్రమలో ఇది సర్వ సాధారణమే. అయితే ఈ విధానంలో కొంత మంది లాభపడొచ్చ.. మరికొంత నష్టపడొచ్చు. ఎలాగంటే.. అన్నిసార్లు అందరి నిర్ణయాలు సరైనవి కాకపోవచ్చు. ఒకరు వద్దనుకున్న కథను మరొకరు ఓకే అంటే ఫలితం బాగుండొచ్చు.. ఒక్కోసారి బెడిసి కొట్టొచ్చు. అయితే భద్ర సినిమా వచ్చేసరికి వ్యవహారం కాసింత భిన్నంగా ఉంది. ఓ హీరో గొప్పతనం అక్కడ కనిపిస్తుంది. ఆ హీరో ఎవరూ.. ఇంతకీ ఆ కథ ఏంటో ఓ సారి చూద్దాం.

    బోయపాటికి మరో గాయం.. బాలయ్య కోసం భరించక తప్పట్లేదు?బోయపాటికి మరో గాయం.. బాలయ్య కోసం భరించక తప్పట్లేదు?

    భద్ర సినిమాకు పదిహేనేళ్లు..

    భద్ర సినిమాకు పదిహేనేళ్లు..

    రవితేజ హీరోగా వచ్చిన భద్ర సినిమాకు పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడిగా బోయపాటి శ్రీనుకు మొదటి అడుగులోనే భారీ విజయం దక్కింది. అయితే కథగా ఉన్న భద్ర తెరపైకి రావడానికి వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో ఓ సారి చూద్దాం.

    ‘ఆర్య' రోజులవి..

    ‘ఆర్య' రోజులవి..

    ఆర్య త‌ర‌వాత మంచి క‌థ‌ల కోసం అల్లు అర్జున్ ఎదురు చూస్తున్నాడట. అదే సమయంలో ద‌ర్శకుడిగా అవ‌కాశాల కోసం వెదుకుతున్నాడట బోయ‌పాటి శ్రీ‌ను. ఓ క‌థ ప‌ట్టుకుని.. గీతా ఆర్ట్స్ త‌లుపు త‌ట్టాడట. తీరా చూస్తే అదే భ‌ద్ర‌. తొలి సిట్టింగ్ లోనే బ‌న్నీకి ఈ క‌థ బాగా న‌చ్చేసిందింటా.

     బోయపాటి-దిల్ రాజు కాంబో..

    బోయపాటి-దిల్ రాజు కాంబో..

    కాక‌పోతే.. అప్ప‌టి త‌న వ‌యసుకీ, స్టామినాకీ, ఇమేజ్‌కీ ఈ క‌థ స‌రితూగ‌దేమో అనే భ‌యం వేసిందట బన్నీకి. కానీ.. బోయ‌పాటిని నిరుత్సాహ‌ప‌ర‌చ‌కూడ‌దని అనుకున్నాడట. అందుకే... బోయ‌పాటిని త‌న కార్లో కూర్చోబెట్టుకుని ఏకంగా దిల్ రాజు ఆఫీసుకి తీసుకెళ్లాడట. `ఓ మంచి క‌థ విన్నా.. మీరు వినండి. మీకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది` అని బోయ‌పాటిని - దిల్ రాజుని క‌లిపాడట.

    అలా రవితేజ ఎంట్రీ..

    అలా రవితేజ ఎంట్రీ..

    దిల్ రాజుకి కూడా క‌థ విప‌రీతంగా నచ్చేసిందట. కానీ.. ఈ క‌థ‌కు బ‌న్నీ సెట్ అవ్వ‌డ‌ని దిల్ రాజుకు కూడా అర్థమైందంటా. ‘ఈ క‌థ నాతో కాదు. వేరెవ‌రితోనైనా చేయండి. సూప‌ర్ హిట్ గ్యారెంటీ' అని బ‌న్నీ కూడా దిల్ రాజుకి భ‌రోసా ఇచ్చాడట. అలా.. ఈ క‌థ‌లోకి ర‌వితేజ వ‌చ్చాడు. మొత్తానికి భ‌ద్ర సెట్స్‌పైకి వెళ్లింది. స‌రిగ్గా ప‌దిహేనేళ్ల క్రితం ఇదే రోజున భ‌ద్ర విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకుంది. బోయ‌పాటికి అదిరిపోయే సక్సెస్ దక్కింది. అలా చాలా ఏళ్ల తరువాత సరైనోడు రూపంలో బన్నీ రుణం తీర్చేసుకున్నాడు బోయపాటి.

    English summary
    Allu Arjun IS The Reason Behind Bhadra Movie. Earlier Boyapati Sreenu Approached Allu Arjun For Bhadra Movie. But He Thinks THat He Will Not Be Suit For That Story. He Advised dil Raju To Listen Bhadra Story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X