Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దుమ్ములేపుతోన్న స్టైలీష్ స్టార్.. బన్నీ లేటెస్ట్ పిక్స్ వైరల్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మామూలుగా నిల్చున్నా కూడా అది నేషనల్ వైడ్ సెన్సేషన్ అవుతోంది. ఆ మధ్య నిహారిక నిశ్చితార్థంలో బన్నీ దిగిన ఫోటోలు, భార్యతో కలిసి ఇచ్చిన పోజులు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్గా గీతా ఆర్ట్స్ ముందు ఏదో క్యాజువల్‌గా అలా దిగిన ఫోటో నెట్టింట రచ్చ చేసింది. అందుకే బన్నీ స్టైలీష్ స్టార్ అయ్యాడు. బన్నీ ఫోటోలు ఈ రేంజ్లో దుమ్ములేపుతోండగా తాజాగా కొన్ని కొత్త ఫోటోలు బయటకు వచ్చాయి.
బన్నీకి ఫోటోలు దిగడమన్నా, తీయడమన్నా బాగా ఇష్టమని తెలుస్తోంది. ఈ మధ్య వరల్డ్ ఫోటో గ్రఫీ డే సందర్భంగా తాను తీసిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. అవి చూసిన ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగిపోయింది. ఓ ప్రొఫెషన్ ఫోటోగ్రాఫర్ దించితే ఎలా ఉంటాయో ఆ ఫోటోలు అంత బాగున్నాయి. తాజాగా బన్నీ తన భార్యను బయటకు అలా షికారుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు అల్లు స్నేహారెడ్డి ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలు బన్నీ అల్లంత దూరంలో పొలాల మధ్యలో ఒక్కడే నడుచుకుంటూ అలా వెళ్తున్నాడు. ఇక బయటకు వచ్చిన కొన్ని ఫోటోల్లో బన్నీ హెయిర్ స్టైల్, లుక్స్ కేక పుట్టిస్తున్నాయి. పుష్ప సినిమా కోసమే బన్నీ ఇలా మారిపోతున్నాడని అందరికీ తెలిసిందే. మామూలు ఫోటోల్లోనే బన్నీ ఇలా ఉంటే ఇక సుకుమార్ చూపించబోయే పుష్పలో ఎలా ఉంటాడో ఊహించుకోవచ్చు.