అంబాజీపేటలో అల్లు అర్జున్ ఫ్రెండ్.. రీల్, రియల్ లైఫ్ కంపైర్ చేస్తూ నెటిజన్స్ షాకింగ్ ట్వీట్స్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన భారీ గ్రాండ్ హిట్ చిత్రం పుష్ప. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు ఎంతటి పేరు వచ్చిందో ఆయన పక్కనే ఉండే కేశవ పాత్రకు కూడా ఆ స్థాయిలో కాకపోయినా తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తుపెట్టుకునే రేంజ్​లో మంచి గుర్తింపు వచ్చింది. పక్కా చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఆయన ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఇటీవలే అనుకోని పరిస్థితుల్లో ఒక యువతి ఆత్మహత్య ప్రేరేపిత కేసులో జైలుకు వెళ్లిన ఆయన ప్రస్తుతం బెయిల్​పై బయటకు వచ్చి షూటింగ్​లలో పాల్గొంటున్నారు. అయితే ఆయన పేరు మరోసారి జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అంతా ఆయన గురించే మళ్లీ తెగ మాట్లాడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే...

పుష్ప : ది రైజ్‌లో పుష్ప రాజ్‌కు నమ్మకమైన స్నేహితుడు కేశవగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు నటుడు జగదీశ్. దీంతో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే కెరీర్​లో మంచి గుర్తింపు వచ్చి కాస్త బిజీ అయిన సమయంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతి కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం సంచలనం రేపింది. దీంతో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న పుష్ప మూవీకి కాస్త బ్రేక్ పడినట్టైంది. కానీ ఆ తర్వాత జగదీశ్​ మళ్లీ బెయిల్​పై బయటకు వచ్చి పుష్ప సెట్స్​లోకి అడుగుపెట్టారు.

Allu Arjun Pushpa Keshava Aka Jagadeesh Prathap Bhandari in Ambajipeta Marriage Band Reel Life Real Life Deference

అయితే ఇదే సమయంలో ఆయన నటించిన ఓ సినిమా కూడా తాజాగా రిలీజైంది. అదే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్​. ఇందులో ఆయన ఓ పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా రిలీజ్​కు ముందు వరకు ఆయన పాత్రకు పెద్దగా స్కోప్​ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు సినిమా రిలీజయ్యాక ఆయన పాత్ర కాస్త హాట్​ టాపిక్​గా మారిపోయింది. హీరో సుహాస్ స్నేహితుడిగా సంజీవి అనే పాత్రలో జగదీశ్​ కనిపించారు.

Allu Arjun Pushpa Keshava Aka Jagadeesh Prathap Bhandari in Ambajipeta Marriage Band Reel Life Real Life Deference

రియల్ లైఫ్​లో జగదీశ్​ అనుమానస్పద యువతి ఆత్మహత్య కేసులో ఏం చేశారో తెలీదు కానీ.. సినిమాలో మాత్రం ఆయన మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. సినిమాలో మహిళలకు ఎంతో గౌరవం ఇస్తూ, వారి ఆత్మ అభిమానాన్ని నిలబెట్టడం కోసం ఎంత దూరమైనా వెళ్లే బలమైన పాత్రలో కనిపించారాయన. దీంతో పుష్ప తర్వాత మళ్లీ ఆయన కంటెంట్​ స్కోప్​ ఉన్న బలమైన పాత్రలో కనిపించడం సర్​ప్రైజింగ్​గా అనిపించిందని ప్రేక్షకులు అంటున్నారు. ఆయన కెరీర్​లో ఇది కూడా మంచి చెప్పుకోదగ్గ పాత్రగా మిగులుతుందని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంచే ప్రస్తుతానికి ఆయన జైలుకు వెళ్లిన కేసుకు.. సినిమాలో తన పాత్రకు పూర్తిగా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది సినిమాలో ఏమో అలా బయట మాత్రం ఇలా అంటూ కూడా కొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి.

ఏదేమైనా ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి అసలు విషయం తేలేవరకు ఆయనపై ఓ క్లారిటీ రాదు. కానీ ఈ సమయంలో జగదీశ్​ ఇటువంటి మంచి భిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడం మాత్రం తనకు కాస్త ప్లస్​ అవుతుందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X