అల్లు అరవింద్ ఇంట్లో పెళ్లి సందడి.. పెద్ద కొడుకు వివాహం.. అమ్మాయి ఎవరంటే!

Recommended Video

Allu Arjun's Brother Ties The Knot || Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. తన పెద్ద కుమారుడు అల్లు బాబీ రెండో వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబంలోని అతికొద్ది మంది సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరిగింది. ఆడంబరాలకు, హంగామాకు దూరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ కనిపించకపోవడం గమనార్హం. ఈ పెళ్లికి స్టైలిష్ స్టార్ హాజరయ్యారా? లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు..

 అల్లు బాబీ భార్య గురించి

అల్లు బాబీ భార్య గురించి

అల్లు బాబీ వివాహం నీలా షాతో జరిగింది. నీలూ పూణేలోని సింబాయిసిస్ కాలేజీ నుంచి ఎంబీఏ పట్టాను సాధించారు. ప్రస్తుతం ఆమె యోగా టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు యోగా డెస్టినేషన్ అనే స్టూడియో కూడా ఉంది. తన సోదరితో కలిసి ఈ స్టూడియోను నిర్వహిస్తున్నారు. ముంబైలో పుట్టి పెరిగిన నీలూ ఇటీవలే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. నీలూ షా తండ్రి కమల్ కాంత్ చమురు రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.

రెండేళ్లుగా నీలూ షాతో అఫైర్

రెండేళ్లుగా నీలూ షాతో అఫైర్

గతంలో అల్లు బాబీ కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. కానీ సినీ ప్రపంచానికి సంబంధించిన వెలుగు, జిలుగులకు దూరంగా ఉంటాడు. అందుకే అతను పెద్దగా ఇండస్ట్రీకి పరిచయం లేకుండా ఉన్నారు. గత రెండేళ్లుగా అల్లు బాబీ, నీలూతో ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరి వివాహం సంప్రదాయ పద్దతిలో నిరాడంబరంగా జరిగింది.

మొదటి భార్యతో బాబీకి విడాకులు

మొదటి భార్యతో బాబీకి విడాకులు

గతంలో నీలిమతో బాబీకి వివాహం జరిగింది. వ్యక్తిగత విభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో వీరిద్దరూ 2016లో విడిపోయారు. బాబీ, నీలిమకు అన్వితా అనే పదేళ్ల కూతురు ఉన్నారు. విడాకుల తర్వాత చాలా కాలంగా ఆయన ఒంటరిగానే ఉన్నారు. నీలూతో పరిచయం ప్రేమగా మారడం, ఆ తర్వాత వారి బంధం పెళ్లి పీటల వరకు వచ్చింది. పెళ్లి హంగులకు దూరంగా జరిగినప్పటికీ సందడిగా కనిపించింది. బాబీ, నీలిమ చాలా జోష్‌తో కనిపించారు.

ఇంటర్నెట్‌లో ఫోటోలు వైరల్

ఇంటర్నెట్‌లో ఫోటోలు వైరల్

అల్లు బాబీ, నీలూ వివాహానికి మెగా కుటుంబం సభ్యులు హాజరుకాలేనట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలలో అల్లు శిరీష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి కనిపించారు. అల్లు అర్జున్ షూటింగ్ కారణంగా హాజరుకాలేదనేది తాజా సమాచారం.

అల్లు అర్జున్ పెళ్లికి దూరంగా

అల్లు అర్జున్ పెళ్లికి దూరంగా

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. అలాగే సుకుమార్‌తో మరో సినిమాకు స్టైలిష్ స్టార్ సిద్దమవుతున్నారు. ఈ కారణంగా పెళ్లికి దూరంగా ఉన్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X