Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘పుష్ప’ స్టోరీ లైన్ లీక్: టైటిల్లోనే అంతా దాగుంది.. అందుకే అల్లు అర్జున్ అలా కనిపిస్తున్నాడా.!
మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోనే అయినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అంతేకాదు, సినిమా సినిమాకూ సరికొత్త స్టైల్‌ను పరిచయం చేస్తూ యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. ఓ భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్.. సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప' అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఆ సినిమా స్టోరీ లైన్ లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం.!
ఆలస్యమైనా అదిరిపోయే హిట్ కొట్టాడు
‘నా పేరు సూర్య' తర్వాత అల్లు అర్జున్ చాలా రోజుల పాటు విరామం తీసుకున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత అతడు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో బన్నీ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ వచ్చి చేరింది.
బన్నీ లేకుండానే మొదలెట్టిన సుకుమార్
భారీ హిట్ అందుకున్న తర్వాత అల్లు అర్జున్... సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ బన్నీ లేకుండానే ప్రారంభం అయింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో వస్తున్న ఈ మూవీకి ‘పుష్ప' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
మళ్లీ అదే ఫార్ములాతో వస్తున్న సుక్కూ
సుకుమార్ సినిమాలన్నీ భిన్నంగా ఉంటాయి. అయితే, అతడి గత చిత్రాలు ‘1 నేనొక్కడినే', ‘నాన్నకు ప్రేమతో', ‘రంగస్థలం' మాత్రం రివైంజ్ డ్రామాగానే తెరకెక్కాయి. ఇప్పడు అల్లు అర్జున్‌తో చేసే సినిమా కూడా అదే జోనర్లో రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పరోక్షంగా వెల్లడించింది. దీంతో అప్డేట్ రాకముందే సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది.
ఒకే ఒక్క దానితో అంచనాలు రెట్టింపు
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇందులో అతడు ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. దీనికి తోడు ఈ సినిమాకు ‘పుష్ప' అనే టైటిల్ పెట్టడంతో బన్నీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయిపోయాయి.
స్టోరీ లీక్: టైటిల్లోనే అంతా దాగుంది
‘పుష్ప' సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. బన్నీ భార్య రష్మిక ఫారెస్ట్ ఆఫీసర్. ఆమెను కొందరు హత్య చేస్తారు. వాళ్లను కనిపెట్టి పగ తీర్చుకునేందుకు గంధపు చెక్కల స్మగ్లర్‌గా అల్లు అర్జున్ ఎంటర్ అవుతాడు. వాళ్లను బన్నీ ఎలా కనిపెట్టాడు.? పగ ఎలా తీర్చుకున్నాడు.? అనేదే సినిమా కథ అని సమాచారం.
Recommended Video
అందుకే అల్లు అర్జున్ అలా కనిపిస్తున్నాడా.!
మొదటి నుంచీ అనుకుంటున్నట్లే ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రాబోతుంది. ఆ విషయాన్ని పోస్టర్లో చెప్పకనే చెప్పింది చిత్ర యూనిట్. అంతేకాదు, టైటిల్లో వేలి ముద్రల గుర్తులు కనిపిస్తుండడంతో ఇది థ్రిల్లర్ మూవీ అని ప్రచారం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో లీక్ అయిన మూవీ స్టోరీ లైన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.