‘ఆహా’ అనిపించేలా న్యూ ఇయర్ గిఫ్ట్.. బన్నీతో సమంత ముచ్చట్లు!
'ఆహా' యాప్ ప్రమోషన్స్ చూస్తే నిజంగానే ఆహా అనిపించేలా ఉన్నాయి. సరైన టైం చూసి సామ్ జామ్ ఎపిసోడ్‌లను రిలీజ్ చేస్తోంది. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, రానా, నాగ్ అశ్విన్, సైనా నెహ్వాల్, తమన్నా, రకుల్, క్రిష్ వంటి వారంతా సందడి చేశారు. వీరితో సమంత చేసిన చిట్ చాట్ బాగానే వర్కవుట్ అయింది. ఇక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌పై ప్రోమోలతో అంచనాలు పెంచేశారు. చిరు సమాధానాలు, సమంత రొమాంటిక్ ప్రశ్నలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో అందరికీ ఓ క్లారిటీ అయితే ఉంది. అయితే బన్నీకి సంబంధించిన ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా? కొందరు నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. అలాంటి వారికి ఓ అప్డేట్ వచ్చింది.

సామ్ జామ్ షోలో బన్నీ పాల్గొన్న స్టిల్స్, ఫోటోలు బయటకు రాగానే అవి ఓ రేంజ్‌లోక్లిక్ అయ్యాయి. ఇక ఫోటోలే అలా వైరల్ అయితే.. ఎపిసోడ్ ఏ రేంజ్‌లో వ్యూస్ దక్కించుకుంటుందో చూడాలి. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎప్పుడు రాబోతోందో ప్రకటించారు. కొత్త ఏడాది ఆరంభంలోనే బన్నీ ఎపిసోడ్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. జనవరి 1 నుంచి బన్నీ సామ్ ముచ్చట్లు అందుబాబులోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications











