సమంతను సర్‌ప్రైజ్ చేసిన అల్లు అర్జున్.. లెటర్‌తో పాటు గులాబీలు పంపి..
టాలీవుడ్ హీరోయిన్ సమంతకు అల్లు అర్జున్ ఓ లెటర్ పోస్ట్ చేశాడు. దీంతో పాటు గులాబీలు కూడా పంపి ఆమెను సర్‌ప్రైజ్ చేశాడు బన్నీ. సమంత లీడ్ రోల్ పోషించిన 'ఓ బేబీ' సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సమంత నటనను చూసి భేష్ అంటున్నారు ప్రేక్షకులు. తాజాగా ఓ బేబీ సినిమా చూసిన అల్లు అర్జున్ సమంతను ప్రశంసల్లో ముంచెత్తుతూ లెటర్ పోస్ట్ చేయడం జరిగింది.
రోజు రోజుకూ బాగా ఎదిగిపోతున్నావ్ సామ్.. అని ఈ లెటర్ లో రాసి పంపించారు అల్లు అర్జున్. అయితే బన్నీ పంపించిన ఈ లెటర్, పూల మొక్క, గులాబీ పూలను చూపిస్తూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది సమంత. 'మీ ప్రశంసలు దక్కినందుకు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది' అని సామ్ పేర్కొంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ సినిమా ఇటీవలే విడుదలై డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. చిత్రంలో లక్ష్మి, సమంత నటన స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. 73 ఏళ్ల ముసలావిడ లక్షణాలతో 25 ఏళ్ల పడుచు పిల్లగా సమంత నటన అబ్బురపరిచింది. చిత్రంలో సమంత, సీనియర్ నటి లక్ష్మి నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తుండటం విశేషం.

'మిస్ గ్రానీ' అనే కొరియన్ మూవీకి తెలుగు రీమేక్‌గా 'ఓ బేబీ' సినిమా జులై 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో సమంత, నాగశౌర్య లీడ్ రోల్స్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి లక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











