Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వైరల్: అర్హ వంటకు అల్లు అర్జున్ ఫిదా.. కొడుకు మాత్రం ఓ మంచి పని వాడిలా..
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ లైఫ్ ను ఏ మాత్రం మిస్సవ్వడు. వీలైనంత వరకు తన పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక లాక్ డౌన్ కాలం నుంచి వారి మధ్య బాండింగ్ మరింత ఎక్కువయ్యిందనే చెప్పాలి. ఇక రీసెంట్ గా తన పిల్లలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసిన బన్నీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాడు.
స్టార్ హోదాను పూర్తిగా పక్కన పెట్టేసి
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారే ప్రయత్నం చేస్తున్న అల్లు అర్జున్ స్టార్ హోదా ఎంత పెరిగినా కూడా ఫ్యామిలీ అనే విషయం వచ్చేసరికి నార్మల్ గా మారిపోతాడు. స్టార్ హోదాను పూర్తిగా పక్కన పెట్టేసి వారితో ఒక నార్మల్ ఫాదర్ లాగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. అల్లు అర్జున్ కంటే ఎక్కువగా ఆయన సతీమణి స్నేహ రెడ్డి ఫ్యామిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
అప్పటి నుంచి వారితోనే..
అల.. వైకుంఠపురములో హిట్టు తరువాత అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రాజెక్టుల ఆలోచనలో పడి ఫ్యామిలీతో ఎక్కువగా ఉండలేకపోయాడు. వెంటనే పుష్ప స్టార్ట్ అవ్వడంతో వర్క్ షాప్ షూటింగ్ వలన మొదట్లో బిజీబిజీగా గడపాల్సి వచ్చింది. ఇక ఎప్పుడైతే కోవిడ్ ఎఫెక్ట్ పడిందో ఆ సమయంలో ఎక్కువగా తన పిల్లలతో టైమ్ స్పెండ్ చేశాడు.
తండ్రి కోసం దోశ వేసిన అర్హ
వీలైనప్పుడల్లా అల్లు అర్హ, అయాన్ లకు సంబంధించిన ఎదో ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు. ఇక పిల్లలు ఇద్దరు కూడా ఎంత సింపుల్ గా ఉంటారో మరోసారి ఫొటోలతో రుజువు చేశాడు. ముఖ్యంగా అర్హ తన తండ్రి కోసం దోశలను వేసింది. అందుకు చాలా సంతోషించినట్లు బన్నీ కామెంట్ చేశాడు.
Recommended Video
ఇంట్లో పనులు చేస్తున్న అయాన్
ఇక అల్లు అయాన్ ఇంట్లో పనులు కూడా చేస్తాడని ఒక వీడియో ద్వారా అర్ధమయ్యింది. స్నాక్స్ కాఫీ వంటివి టేబుల్ మీద పెడుతూ సహాయం చేస్తున్నాడు అయితే కొద్దిసేపటికే బన్నీ ఆ వీడియోను డిలీట్ చేసేశాడు. ఇక అయాన్ ఇప్పుడే ఇంత అనుకువుగా ఉన్నాడు అంటే రేపు స్టార్ హీరో అయ్యాకా ఇంకెలా ఉంటాడో అని నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.